అఖిలాంధ్ర
ఆంధ్ర ప్రదేశ రాష్ట అవతరణమునకు అసలు పునాది 1911 లోనే పడి చివరికి 1956 కు పూర్తీ అయినది. తెలుగు ప్రముఖులు జొన్నవిత్తుల గురునాధం, ఉన్నవ లక్ష్మినారాయణ గార్లు 1911 లోనే దక్షిణ భారత దేశంలోని తెలుగు వారు నివసించే ప్రాంతాలన్ని కలిపి ఒక రాజకీయ “అఖిలాంధ్ర” రాష్ట్ర పటాన్ని తయారు చేశారు. (Formation of Andhra Pradesh)
ఆంధ్రుల ఆలోచనా విధానం, పోరాట పటిమ అనన్యమయినవి. అందుచేత ఆంధ్రులు చాలాసార్లు చరిత్రలో తమ స్వీయప్రయోజనాలను ప్రక్కకు పెట్టి దేశ శ్రేయాస్సుకు పెద్ద పీట వేసేవారు. వారిలో ఉండే దేశభక్తి శ్లాఘనీయమయినది. స్వరాష్ట్ర ఆకాంక్ష స్వాతంత్ర్య పోరాటానికి అడ్డు అనుకున్నప్పుడు ఆంధ్ర రాష్ట్ర వాదాన్ని కొన్నాళ్ళు ప్రక్కక్కు పెట్టి దేశ స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారు.
ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు – ప్రధమాంకము
బెంగాలు విభజన నిలుపుదల (1911) భారత దేశంలో శాంతియుత ఉద్యమాల విజయాలకు నాంది పలికిందని చెప్పవచ్చు.
వందే మాతరం ఉద్యమం సఫలీకృతమయి భారత ప్రభుత్వం ( అప్పటి బ్రిటిషు వారి ఆద్వర్యంలో ఉన్న) బెంగాలు విభజనను రద్దు చేయడం ఆంధ్రులకు స్పూర్తిదాయకమయి ఆంధ్రులకు ఒక స్వంత రాష్ట్రం ఉంటే బాగుంటుంద నే ఒక అభిప్రాయం ఆంధ్రులకు 1911 లోనే మొదలయిందని చెప్పవచ్చు.
నా ఈ వ్యాసాలను కూడా చదవండి
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అవతరణకు ముందు ఆంధ్రులు సాగించిన శాంతియుత పోరాటాల వివరాలు ఈ క్రింద చూపినవిధంగా వరుస క్రమంలో టూకీగా వివరించడమయినది.
1912, మే నెలలో తీరాంధ్రం లోని కృష్ణ, గోదావరి జిల్లాల తెలుగు ప్రముఖుల సమావేశం జరిగింది. అందులో ఆంధ్ర రాష్టం కోసం ఒక తీర్మానం ప్రవేశ పెట్టగా ఈ ప్రత్యేక ఆంధ్ర సమస్య ఒక జిల్లా సమస్య కాదని ఇది అన్ని జిల్లాలవారు కలిపి నిర్ణయించాల్సిన విషయమని సభ్యులు ఆ తీర్మానాన్ని త్రోసిపుచ్చారు.
నా ఈ వ్యాసాలను కూడా చదవండి
1914, ఏప్రియల్ 11 వ తేదీన విజయవాడలో రెండవ సభ జరిగింది. కందుకూరి వీరేశలింగం, తిరుపతి వేoకట కవులు, పురాణ పండ వెంకట సుబ్బయ్య, న్యాపతి సుబ్బారావులు ఈ సభకు హాజరయ్యారు. ఆంధ్ర రాష్ట్ర స్థాపనకు చేసిన తీర్మానం ఇక్కడ గెలిచింది.
పట్టాభి సీతారామయ్య, కోపెల్ల హనుమంతరావు
1911 – 1914 మధ్యలో వెంకటప్పయ్య గారు ‘ ఆంధ్రోద్యమం’ అనే కావ్యం రచించారు. పట్టాభి సీతారామయ్య గారు, కోపెల్ల హనుమంతరావు గారు కలసి ‘ఆంధ్ర రాష్ట్రం’ రచించారు. తెలుగు ప్రముఖులు జొన్నవిత్తుల గురునాధం, ఉన్నవ లక్ష్మినారాయణ 1911 లోనే దక్షిణ భారత దేశంలోని తెలుగు వారు నివసించే ప్రాంతాలన్ని కలిపి ఒక అఖిలాంధ్ర రాష్ట్ర పటాన్ని పటాన్ని తయారు చేశారు.
ఆంధ్ర పత్రిక
1914 నాటికి కాశీనాధుని నాగేశ్వరరావు గారి ‘ఆంధ్ర పత్రిక’ ప్రచురణ బొంబాయినుండి మద్రాసుకు తరలించబడినది.
స్వరాజ్య ప్రత్రిక
1921 లోనే ప్రకాశం పంతులు గారు ప్రారంభించిన ‘స్వరాజ్య ప్రత్రిక’ ( Swarajya Patrika ) అనే ఇంగ్లీషు భాషా పత్రిక కూడా అంధ్రోద్యమానికి నిరుపమానమయిన సేవ చేసినది.
మూడవ ఆంధ్ర మహాసభ
మూడవ ఆంధ్ర మహాసభ 1915 మే నెలలో విశాఖ పట్టణంలో జరిగింది. పానుగంటి రాజా, వెంకటపతిరాజుల సారధ్యంలో ఈ సభ జరిగింది. ఇక్కడ మద్రాసు రాష్ట్రంలోని 11 తెలుగు జిల్లాలు కలిపి ఒక రాష్ట్రం గా నెలకొల్పబడాలని తీర్మానించారు.
నాల్గవ సభ కాకినాడలో 1916 మే నెలలో మట్నూరి కృష్ణారావు గారి అధ్యక్షతన జరిగినది. తరువాత దేశాన్ని భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా ఏర్పాటు చెయాలనె విజ్ఞాపన పత్రాన్ని 1917 లో ఆమోదించారు.
ఐదవ సభ నెల్లూరు లో 1917 జూన్ 1 వ తేదీన జరిగినది. హాజరయిన వారిలో రాయలసీమవారు అధికులు. గుత్తి, అనంతపురం జిల్లాలకు చెందిన పిళ్ళే, నంధ్యాల, కర్నూలుకు చెందిన ఏకాంబర్ అయ్యర్ లు ఆంధ్ర రాష్ట్ర తీర్మానాన్ని వ్యతిరేకించగా కర్నూలు వాస్తవ్యులు సభాధ్యక్షులు హరి సర్వోత్తమరావు గారు తెలివిగా
జిల్లావారీ ఓటింగు (అనగా జిల్లకు ఒక ఓటు అనే పద్ధతి) పెట్టి తీర్మానాన్ని నెగ్గించారు.
1917 డిశంబరు లో న్యాపతి సుబ్బారావు ఆద్వార్యంలో తెలుగు వారు భాషాప్రయుక్త రాష్ట్రాల ప్రాతిపదికన దేశాన్ని పునర్నిర్మించాలని మాంటెగ్ చెంస్ ఫర్డు రాంజ్యాంగ సంస్కరణల కమిటి కి
విజ్ఞప్తి చేశారు.
1918, ఫిబ్రవరి లో భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకోసమై ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ లో బి ఎన్ శర్మ గారు ఒక తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు. అక్కడ జిన్నా, శ్రీనివాస శాస్త్రి మొదలగు వారు వ్యతిరేకించడంవల్ల తీర్మానం వీగిపోయింది.
1917 లో కలకత్తా లో జరిగిన కాంగ్రెస్ మహాసభలో ప్రత్యేక అంధ్ర కాంగ్రెస్ కమిటిఏర్పాటుకు అంగీకరించారు. బాల గంగాధర తిలక్ భాషాప్రయుక్త రాష్ట్రాల వాదాన్ని సమర్ధించారు. మరుసటి సంవత్సరం
లోనే 1918 లో ప్రత్యేక అంధ్ర కాంగ్రెస్ కమిటి ఏర్పడినది.
1920 నాగపూర్ లో సేలం విజయ రాఘవాచారి అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ సభలో భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును ఆమోదిస్తు తీర్మానం చేశారు.
ఈ కాలంలో బ్రాహ్మణ వ్యతిరేక పార్టి అయిన జస్టీస్ పార్టి హోమ్ రూల్ ఉద్యమాన్ని , ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర వాదాన్ని వ్యతిరీకించింది
పిల్లలమర్రి అంజనేయులు
1927 మార్చి 14 వ తేదీన మద్రాసు శాసన సభలో పిల్లలమర్రి అంజనేయులు ప్రవేశపెట్టిన ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర తీర్మానాన్ని మద్రాసు ప్రభుత్వం ఆమోదించి భారత ప్రభుత్వానికి పంపింది. కాని ఉపయోగంలేకపోయింది..
సైమను కమీషను వచ్చినపుడు కేంద్ర కాంగ్రెస్స్ కమిటీ అభిప్రాయానికి
విలువనిచ్చి మద్రాసులోని అంధ్రులు గొబ్యాక్ సైమన్ అంటూ సైమను రాకను నిరసించారు.
(అయితే సైమను కు స్వరాష్ట్రం కావాలని ఒరిస్సా, సింధు ప్రజలు మహాజరు ఇచ్చి సొంత రాష్ట్రాలు ఏర్పరచుకొన్నారు).
1928 లో మోతిలాల్ నెహ్రు ఆధ్వర్యంలో రాజ్యాంగ సంస్కరణల కొరకు ఒక కమిటి ఏర్పాటయ్యింది. ఆయన ఇచ్చిన నివేదిక లో ( నెహ్రు రిపోర్ట్ Nehru Report లో ) భాషాప్రయుక్త రాష్ట్రాల వల్ల పరిపాలనా సౌలభ్యం బాగుంటుందని చెప్పారు.
ALSO READ MY ARTICLES ON
- Indian Constitution
- Fundamental Rights
- Basic features of the Constitution
- Article 20
- Right to Life and Liberty
- Magna Carta
- England Bill of Rights
- American Bill of Rights
- French Bill of Rights
1932 లో బొబ్బిలి రాజా, మోచర్ల రామచంద్రరావు, ఎపి పాత్రో, వి వి గిరి, వి వి జోగయ్య తదితరులు లండన్ వెళ్ళి సెక్రటరి ఆఫ్ స్టేట్ ను కలసి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం గురుంచి అభ్యర్ధించారు. మరల 1935 జూన్ 27 దేదీన నరసింహరావు, సుబ్బరావు, సాంబ ముర్తి తదితరులు ఇంగ్లాండు వెళ్ళి మహాజరులు సమర్పించారు.
అప్పటికి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర వాదానికి రాయలసీమ వారి అభ్యంతరాలు అలాగే ఉన్నాయి. 1927 లో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఏర్పడిన తరువాత ఈ విభేదాలు ఎక్కువయినవి.
నా ఈ వ్యాసాలను కూడా చదవండి
1937 లో జరిగిన ఎన్నికలలో మద్రాసు రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిచింది. రాజగోపాలాచారి ముఖ్యమంత్రి అయ్యాడు. ఆంధ్రా నుంచి బెజవాడ గోపాలరెడ్డి, ప్రకాశం మరియు వి వి గిరి మంత్రులు గా జాయిన్ అయ్యారు.
శ్రీ బాగ్ ఒప్పందం 16.11.1932 తేదీన రాయలసీమ ఆంధ్రులకు, కోస్తాజిల్లాల ఆంధ్రులకు మధ్య జరిగింది. నదీ జలాల వాటాలు , రాజధాని, హై కోర్టు ఏర్పరచాల్సిన స్థలం గురుంచి వివరాలు ఈ ఒప్పందం లో వ్రాసుకొన్నారు.
భాషాప్రాతిపదికన
21.4.1938 తేదీన భాషాప్రాతిపదికన మద్రాసు రాష్ట్రాన్ని విభజించాలని మద్రాసు అసెంబ్లీ లో ఆమోదించిన తీర్మానాన్ని భారత ప్రభుత్వానికి పంపించారు. 1939 మార్చి లో అది తిరస్కరింపబడినది.
1946 లో టంగుటురి ప్రకాశం పంతులు గారు మద్రాసు రాష్ట్ర ముఖ్య మంత్రి అయ్యారు.
1947 ఆగష్టు 14 తేదీన జవహర్లాల్ నెహ్రు గారు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం నూతన రాజ్యాంగం లో పొందుపరచబడుతుందని చెప్పారు.
ఆగష్టు పదిహేను 1947 తేదీ నాటికి బ్రిటిషు వారిని భారతీయులు దేశం నుండి వెళ్ళగొట్ట గలిగారు. తమ దేశ రాజకీయ భవిష్యత్తు నిర్ణయించుకోవడానికి భారతీయులు స్వతంత్ర్యులయ్యారు.
దేశ స్వాతంత్ర్య పోరాటంలో తీరాంధ్ర జిల్లాలయిన సర్కారు, చిత్తూరు, నెల్లూరు జిల్లాలలోను మరియు
రాయలసీమలో ను ఉన్న ఆంధ్రులు విరివిగా పాల్గొన్నారు.
దేశాన్ని ఐక్య పరిచే ప్రక్రియలో నెహ్రు గారు మునిగి తేలుతున్న ఆ రోజుల్లో ఆంధ్రుల ప్రత్యేక రాష్ట్ర వాదం ఆయనకు విపరీత ధోరణిగా తోచి ఉండవచ్చు. ఆయనకు తమిళుల వేర్పాటువాదాన్ని నివారించడం ప్రధాన సమస్య గా భావించి ఉండవచ్చు. అప్పట్లో మద్రాసు రాష్ట్రం లో ఆంధ్ర రాజ్యము, మళయాళ, కన్నడ భాషల వారి కొన్ని ప్రాంతాలు చేరిఉండేవి. ఆరోజుల్లో హిందీ ప్రాంతం వారంటే తమిళులకు ఏవగింపు ఉండేది. మద్రాసు రాష్ట్రంలో మైసూరు, కొచ్చిను, కాళికట్ రాజ్యాలు (సంస్థానాలు ) కూడా కలిపి ధక్షిణ దేశంగా ఏర్పరచాలని ఒకసారి రాజాజి అన్నాడు.
అలాంటి సమయంలో తమిళుల ఆధీనంలో ఉన్న కోస్తా జిల్లాలను, రాయలసీమ జిల్లాలను మద్రాసు నుండీ విడదీస్తే హిందుస్తానీయులంటే తమిళులకున్న వ్యతిరేకత ఎక్కువై దేశ ఐక్యతకు ముప్పు వాటిల్లు తుందని నెహ్రు భయపడిఉండవచ్చు.
ఇలాంటి ఆలోచనలతో నెహ్రు గారు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని వ్యతిరేకించి ఉండవచ్చు.
అంతకు ముందు నెహ్రు గారు ఆంధ్రుల ఈ స్వరాష్ట్ర కోరికను ఆంధ్ర సామ్రాజ్య వాదంగా అభి వర్ణించి యున్నారు.
తమిళులు ఆంధ్ర వారి క్రొత్త రాష్ట్రానికి రాజధాని నిమిత్తం ఇవ్వవలసిన సొమ్ము ఇవ్వకుండా మద్రాసు వారు ఎగ్గొట్టడానికి హైదరాబాదు ను తెలుగు వారి రాజధానిని చేసి ఆంధ్ర ప్రదేష్ రాష్ట్రాన్ని ఏర్పరచి ఉండవచ్చు.
తెలుగు వారు ఈ విధంగా కలసి పెద్ద రాజ్యమయి పోయి ఏకతాటిమీద ఉండి హిందుస్థానియులకు అనగా ఉత్తర భారతీయులకు అధికారం లో పోటీకి రాకుండా ఉండేటట్లు ఫజల్ అలి కమీషన్ ద్వారా రెండు తెలుగు ప్రాంతాలలో విభేదాలు రగిలే విధంగా కమీషన్ రిపోర్ట్ తయారు చెసి ఉండవచ్చు.
నిజానికి నెహ్రు గారు రాజ్యాంగ రీత్య ఆంధ్ర రాష్ట్రము హైదరాబాదు రాష్ట్రము కలిపి ఆంధ్ర ప్రదేష్ ఎర్పరచి పెద్దమనుషుల ఒప్పందం పెరుతో ఆంధ్రాను విభజించినట్లయినది. రాజ్యాంగంలో పొందుపరచిన పౌర హక్కులకు వ్యతిరేకమయిన షరతులు పెద్దమనుషుల ఒప్పందంలో పొందుపరచారు. ఈ షరతులు రెండు ప్రాంతాల వారిని ఎప్పటికి కలవకుండా చేసి ఇప్పుడు రాష్ట్రాన్ని ముక్కలు చెక్కలు చెయ్యడానికి ఉపయోగపడుతున్నయి.
ఇప్పుడు అనగా షుమారు 60 సంవత్సరాల కలయిక తరువాత పూర్వపు కారణాలే చూపించి రాష్ట్రాన్ని విడదీయడం న్యూ ఢిల్లీ చారిత్రక తప్పు చేస్తుందనుకుంటున్నను.
Nehru’s Comments on Visalandhra
In Indian Express 17th October 1953, Nehru was quoted to have said: “there is an underlined expansionistic and imperialistic design in the argument of Visalandhra slogan of Andhras”.
1948 జూన్ లో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు ధార్ కమిషన్ ఎర్పాటు చేశారు. అయితే ధార్ కమిటీ భాషా ప్రయుక్త రాష్ట్రాలకు వ్యతిరేకంగా నివేదన సమర్పించింది.
స్వామి సీతారమ్
గొల్లపూడి సీతారామశాస్త్రి లేక స్వామి సీతారమ్ అనే ఆయన 1951 ఆగష్టు లో ప్రత్యేక రాష్ట్రం కావాలని నిరాహార దీక్ష చేశారు. 35 రోజుల తరువాత ఆచార్య వినోభాభావె సెప్టెంబర్ 20 న దీక్ష విరమింపచేశారు.
నిరాహార దీక్షలు చెయ్యటం రాజ్యాంగేతర పద్ధతుల ద్వార ప్రభుత్వాన్ని లొంగదియ్యడమని నెహ్రు వ్యాఖ్యానించారు.
తరువాత జవహర్లాల్ నెహ్రు, పటేల్, సీతారమయ్య ల కమిటి ఏర్పరచారు. ఈ కమిటీ మద్రాసు పట్టణ విషయమై రాయలసీమ వాసులకు ఉన్న మమకారమును లేవనెత్తి ప్రత్యేక రాష్ట్ర వాదనను నీరుగార్చింది.
పొట్టి శ్రీ రాములు
ఇలాంటి పరిస్థుతుల్లో నెల్లూరు వాసి అయినశ్రీ పొట్టి శ్రీ రాములు గారు 1952 అక్టోబర్ 19 తేదీన ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. నెహ్రు గాని, రాజగోపాలాచారి గాని శ్రీ రాములు గారి నిరాహార దీక్షను తేలికగ తీసుకున్నారు. దీక్ష 52 రోజులు నిండిన తరువాత శ్రీ పొట్టి శ్రీ రాములు గారి ప్రాణాలు అనంతవాయువులలో కలసిపోయినవి.
చివరకు త్యాగ ధనుడు అమర జీవి పొట్టి శ్రీరాములు గారి ఆత్మ త్యాగంతో ఆంధ్రుల చిరకాల వాంఛ కొంత
సాకారమయ్యింది. 1953 అక్టోబర్ 1 వ తారీఖున తెలుగు వారి ప్రాంతాలు మద్రాసు రాష్ట్రం నుండి విడివడి
ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినది. అయితే క్రొత్తగా ఏర్పాటు అయిన ఆంధ్ర రాష్ట్రం తో నైజాం లోని ఆంధ్రుల ఐక్యత జరగవలసి ఉంది.
ALSO READ MY ARTICLES ON
- Indian Constitution
- Fundamental Rights
- Basic features of the Constitution
- Article 20
- Right to Life and Liberty
- Magna Carta
- England Bill of Rights
- American Bill of Rights
- French Bill of Rights
( తద్వారా భారత దేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అవతరణ నాంది పలికింది.)
శ్రీ ఫొట్టి శ్రీరాములు గారి ఆత్మ త్యాగం దేశాన్ని కుదిపివేసింది. ఉద్యమం తీవ్రస్థాయిలో జరిగింది. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా తెన్నేటి విస్వనాథం, దంతులూరి నారయణరాజు, సి వి సోమయాజులు మొదలగు వారు మంత్రి పదవులకు రాజినామాలు సమర్పించారు.
చివరకు నెహ్రు 1952 డిశెంబరు 19 తేదీన మద్రాసును విభజించి ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు జరుగుతుందని పార్లమెంటులో ప్రకటన చేశారు.
1952 లో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. అసలు టంగుటూరి ముఖ్యమంత్రి కావలసి ఉన్నా తమిళులను బుజ్జగించడానికి నెహ్రు రాజగోపాలాచారిని ముఖ్యమంత్రిని చేశారు. రాజాజి మద్రాసుకు నీటి సరఫరాకోసం కృష్ణా పెన్నార్ ప్రాజక్టు ప్రారంభించగా తెలుగువారు ఆ ప్రాజక్టు కు వ్యతిరేకంగా పెద్ద ఉద్యమం నిర్వహించారు.
1953 అక్టోబర్ ఒకటిన ఆంధ్ర రాష్ట్రం అవతరించింది.
తాత్కాలిక రాజధానిగా కర్నూలును నిర్ణయించారు. ప్రకాశం గారు తొలి ముఖ్యమంత్రిగాను నీలం సంజీవరెడ్డి ఉపముఖ్యమంత్రిగాను నిర్ణయింపబడ్డారు. కర్నూలును రాజధానిగా నిర్ణయించడాన్ని విమర్శించినవారికి ప్రకాశంగారు త్వరలోనే ఆంధ్రులకు అసలు రాజధాని ఏర్పడుతుందని శెలవిచ్చారు. అనగా 1953 నాటికే హైదరాబదు ను ఆంధ్ర రాష్ట్రం తో కలిపి ఆంధ్ర ప్రదేశాన్ని ఏర్పరిచే ఆలోచన ఢిల్లి కి ఉందని విశదమవుతుంది.
ఆంధ్రుల ప్రత్యేక రాష్త్రం ఎర్పడిన అనతి కాలంలోనే తిరుపతిలో శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయo ఏర్పడినది. గుంటూరులో హైకోర్టు స్థాపించారు.
మద్రాసునుండి కోస్తాంధ్రులు, సీమాంధ్రులు విడివడి పోయి ఆంధ్ర రాష్ట్రం గా ఏర్పడినను భారతదేశంలో ఆంధ్రులు ఇంకా సాధించాల్సిన విషయాలు పూర్తికాలేదు. తెలంగాణా అని పిలువబడే నైజాంలోని ఆంధ్రులు నివసిస్తున్న ప్రాంతాలు క్రొత్తగా ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రం తో కలపి విశాలాంధ్ర నిర్మాణం జరగాల్సి ఉంది.
నైజాం ఆంధ్రులు
తీరాంధ్ర ప్రజలు నిజాం సంస్థానాన్ని వాడుకలో నైజాం అనేవారు. మొఘలుల కాలంలో 1724 లో నిజాం ఉల్ ముల్క్ అనే ఆయన డిల్లీ లోని రాజకీయ అనిశ్చిత స్థితి నుండీ వైకొలగడానికి డెక్కను సుబహ కు సుబేదారు గా అనుమతి తీసుకొని ఔరంగాబాదు రాజధానిగ రాజ్యం చేశాడు.
తరవాత కొంతకాలానికి హైదరాబాదుకు తన రాజధానిని మార్చాడు. ఈయన వారసులకి ఆవిధంగా వచ్చిన రాజ్యమే ప్రస్తుతం మనం చర్చించుకుంటున్న నైజాం.
అప్పట్లో నిజాం పరిపాలనలో నాలుగు ప్రధాన సుభా లు ఉండేవి. ఒకటి వరంగల్లు, రెండు మెదక్, మూడు ఔరంగాబాదు, నాలుగు గుల్బర్గా.
(అంచెలంచెలుగా నిజాం తీరాంధ్ర ప్రాంతాన్ని రాయలసీమ ప్రాంతాన్ని బ్రిటిషు వారికి అమ్ముకోవటం వల్ల ఆంధ్రులు కొంతమంది బ్రిటిషు వారి మద్రాసు ప్రెసిడెన్సి లోను కొంతమంది నైజాం లో ను షుమారు ఒక వంద సంవత్సరాలు విడివిడిగా ఉన్నారు).
తెలుగు భాష మాట్లాడే వారు నైజాం లో అధికులయినను రాజధానిలో మాత్రం ఇతరుల ( మరాఠీలు, కన్నడిగులు, హిందుస్థానిలు, బెంగాలీలు ) ప్రాబల్యం అధికంగాఉండేది. ఆ కాలంలో జిల్లాలలో సర్దారులు, జాగీర్దారులు, మొఘసదార్లు, ఫత్తేదారులు మొదలయిన వారు నిజాంకు అనుయాయులుగా ఉండే భూస్వాములు.
నిజాం పరిపాలన లో ఉన్న తెలుగు ప్రాంతాలను తెలంగాణా అనేవారు. అయితే వీరు తమని తాము ఆంధ్రులు అని పిలుచు కొనే వారు.
నైజాంలో ప్రభుత్వం పరాయి పాలన క్రింద వస్తుంది. అక్కడి రాజ భాష ఉర్దు. ఎవరయిన ప్రభుత్వ కొలువు ఆశించినట్లయితే తప్పనిసరిగ ఉర్దు నేర్వాల్సిందే. తెలుగు మాత్రుభాష అయిఉండి చదువు వచ్చినవారు కూడా తెలుగులో చదవడం వ్రాయడం తెలియ కుండా ఉండేవారు. అందుచేత తెలంగాణా లోని సామజిక స్ప్రుహ కలిగిన చైతన్యం కలిగిన తెలుగు ప్రజలలోని పెద్దమనుషులు ప్రధమంగా చేపట్టిన పని ప్రజలకు తెలుగు నెర్పడమే.
కొమర్రాజు లక్ష్మణరావు
శ్రీ కొమర్రాజు లక్ష్మణరావు హైదరాబాదులోశ్రీకృష్ణ దేవరాయ ఆంధ్ర భాషా నిలయమును 1901 లో స్థాపించారు. దీనికి మునగాల జమిందారు నాయని వెంకటరంగారావు, హైదరాబాదు మన్సబ్ దారు రావిచెట్టు రంగారవులు సహకరించారు. శ్రీ లక్ష్మణరావు గారు 1906 లో విజ్ఞాన చంద్రిక మండలి స్థాపించారు.
1921 లో నైజాంలో హైదరాబాదు లో జరిగిన ఒక సంఘటన తెలుగువారి లో భాషాభిమానాన్ని మేలుకొల్పింది. 1921 నవంబరు 11 – 12 తేదీ లలో జరిగిన్ నిజాం రాష్ట్ర సాంఘిక సంస్కరణల సమావేశంలొ అల్లంపల్లి వెంకట రామారావు తెలుగులో మాట్లాడి ఒక తీర్మానాన్ని ప్రతిపాదించగా సభ నుంచి భాషావిషయమై అభ్యంతరాలు ఎదుర్కోవలసి వచ్చింది. అప్పుడు అక్క్డడున్న తెలుగు వారందరు ఈ సంఘటన తెలుగువారికి అవమానంగా భావించి ఆరాత్రే ‘ ఆంధ్ర జన సంఘం ‘ ను స్థాపించారు. వీరిలో ప్రముఖులు మాడపాటి హనుమంతరావు, మందుముల నరసింగరావు, బూర్గుల రామకృష్ణారావు, ఆదిరాజు వీరభద్రరావు తదితరులు.
తరువాత 1922 లో ఫిబ్రవరి 14 న కొండా వెంకటరంగారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆంధ్ర జన సంఘం పేరును నైజాం సంస్థాన ఆంధ్ర జన సంఘంగా మార్చారు. ఇక్కడ ఒక విషయం గమనించాలి. నిజాం ప్రభుత్వం వారు తెలుగు ప్రాంతాన్ని తెలంగాణ అనిపిలిచేవారు. ప్రజలు తమని తాము ఆంధ్రులు గానే సంభోధించుకొనే వారు.
నిజాం ఆంధ్ర సభ
జోగిపేట లో జరిగిన సభకు సురవరం ప్రతాపరెడ్డి అధ్యక్షత వహించారు. ఆ సభలోనే ఆంధ్ర జన సంఘం పేరును నిజాం ఆంధ్ర సభ గా మార్చడమయినది.
తెలుగు ప్రజలలో వస్తున్న ఈరకమయిన చైతన్యాన్ని నిజాం ప్రభుత్వం సహించలేదు. సభలకు ఆంక్షలు విధించింది. అందుచేత నైజాం ఆంధ్రులు తమ తరువాత సభలు ఇతర రాష్ట్రాల్లో జరుపుకునేవారు.
అలాగే తెలంగాణా అని పిలవబడుతున్న నైజాం లోని ఆంధ్రులు నిజాము ను గద్దె దించడానికి తొలుత నిరాయధంగాను తదుపరి సాయుధంగాను పోరాటం జరిపి చివరకు 1948 నాటికి కృతకృత్యులయినారు.
నైజాం లోని ఆంధ్రులు నైజాంను, అతని సైన్యాన్ని, రజాకార్లను, దొరలను ఎదిరించి పోరాడారు. దీన్నే తెలంగాణా సాయుధ పోరాటం అంటారు. ఇందులో కమ్యునిస్టులు, ప్రజలు కలసి పోరాటం సలిపారు. చివరకు భారతదేశం తీసుకున్న పోలీసు చర్యతో నిజాం పాలన సెప్టెంబరు 17, 1948 నాటికి అంతమయినది.
1952 ఎలక్షన్లలో తెలంగాణాలో కమ్యునిష్టులు మొత్తం 105 స్థానాలకు గాను 42 స్థానాలు సంపాదించారు. అలాగే మద్రాసు రాష్ట్రం లోని తెలుగు ప్రాంతాలయిన గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు ప్రాంతాలలో కూడా కమ్యూనిష్టులు అధిక సీట్లు సాధించారు.
కమ్యునిష్టుల ప్రాబల్యం చూసి విశాలాంధ్ర కోరిక ప్రజల్లోనిదని కాంగ్రెస్ వారు గ్రహించి అప్పటినుండి విశాలాంధ్రను బలపరచడం ప్రారంభించారు.
పూర్వం 1911 లో కొండా వెంకటప్పయ్య గారు భారత దేశంలోని అన్ని తెలుగు భాష మాట్లాడె వారి భౌగోఌక ప్రాంతాల్ని కలుపుతూ ‘ అఖిలాంధ్ర దేశం ‘ గా ఒక చిత్రపటం తయారు చేశారు అని ముందు చెప్పుకొన్నము కదా.
ఈ పేజీలు కూడా చదవండి
- మహాత్మా గాంధీ 1869-1915
- జవహర్లాల్ నెహ్రూ 1889-1940
- డా. సర్వేపల్లి రాధాకృష్ణన్
- మోక్షగుండం విశ్వేశ్వరయ్య
అయితే కొన్ని ప్రాంతాలు నైజాం ఆధీనంలో ఉన్నవని అఖిలాంధ్ర కల వెంటనే తీరేది కాదని అప్పట్లో తెలుసుకొని నైజాం లో ఆంధ్ర ప్రాంతాల విషయం ప్రక్కకు పెట్టి మద్రాసు లోని తెలుగు ప్రాంతాల గురించి మాత్రమే మొదటి పోరాటం రాజ్యాంగ బద్ధంగా, శాంతియుతంగా జరిపారు.
‘విశాలాంధ్ర’
అన్ని తెలుగుప్రాంతాల్ని కలిపి ఒకే రాష్ట్రం గా ఉండాలనే భావన 1945 లో మళ్ళీ
పొడచూపింది. అదియే ‘విశాలాంధ్ర’. పుచ్చలపల్లి సుందరయ్య అనే ఆయన ‘ విశాలాంధ్రలో ప్రజారాజ్యం ‘ అనే పేరుతో ఒక పుస్తకం వ్రాశారు. 1949 లో అయ్యదేవర కాళేశ్వరరావు గారు విజయవాడ లో విశాలాంధ్ర మహాసభ నిర్వహించారు. 1950 లో వరంగల్లు లో విశాలాంధ్ర సభ జరిగింది. ఈ సభకు ప్రకాశం గారు, కోదాట రామలింగం, హయగ్రీవాచారి, సత్యమూర్తి తదితరులు హాజరయ్యరు.
1950 లో నిజామాబాదు లో జరిగిన హైదరాబాదు స్టేటు కాంగ్రెస్ మహాసభ లో ‘ హైదరాబాదు రాష్త్రాన్ని భాషాప్రాతిపదికన మూడు భాగాలుగా విభజించి ఆయాప్రాంతాలను పరిసర భాషారాష్ట్రాలలో కలిపివేయాలని ‘ కోరుతు తీర్మానించారు.
1951 లో బెంగళూరులో జరిగిన అఖిల భారత కాంగ్రెసు మహాసభలో శ్రీ కాళేశ్వరరావు గారు విశాలాంధ్ర గురుంచి ప్రస్తావించగా నెహ్రు ‘అనవసర విషయాలు’ ప్రస్థావించవద్దని హెచ్చరించారు. అలాగే నెహ్రు గారు 1953 అక్టోబరు లో విశాలాంధ్ర ఉద్యమం ఆoధ్రుల సామ్రాజ్యవాదమని విమర్శించారు.
Nehru’s Comments on Visalandhra
In Indian Express 17th October 1953, Nehru was quoted to have said: “there is an underlined expansionistic and imperialistic design in the argument of Visalandhra slogan of Andhras”.
భాషాప్రాతిపదికన ప్రత్యేక రాష్ట్రాలు 1956 నుంచి మాత్రమే ఏర్పడటం మొదలయింది. అంతకుముందు హైదరాబాదు రాష్ట్రం లో తెలుగుప్రాంతాలే కాకుండా మరాఠీ, కన్నడ ప్రాంతాలు కలసి ఉండేవి.
కొండా వెంకటరెడ్డి ముందు విశాలాoధ్రకు అనుకూలంగా మాట్లాడి తరువాత 1954 లో తాను హైదరాబాదు ప్రత్యేకంగా ఉండాలనుకొంటున్ననన్నారు.
భూర్గుల రామకృష్ణారావు
భూర్గుల రామకృష్ణారావు గారు తొలుత ఆంధ్ర హైదరాబాదు రాష్ట్రాలు కలవనఖ్కరలేదని చివరకు విశాలాంధ్రకోసం ముఖ్యమంత్రి పదవినుండి తప్పుకున్నారు.
ఆంధ్ర హైదరాబాదు లు కలపవద్దన్నవారిలో కోస్తా ఆంధ్ర ప్రముఖులు – ఆచార్య రంగా, ఆవుల గొపాలకృష్ణమూర్తి, నడింపల్లి నరసింహరావు, దురువూరి వీరయ్య ఉన్నారు .
ఫజల్ ఆలి కమిషన్
1954 లో రాష్ట్రాల పునర్విభజన కమీషను ఫజల్ ఆలి అధ్యక్షతన హైదరాబాదు వచ్చినది.
శ్రీ ఫజల్ కమిషన్ నివేదిక ఆంధ్రులకు మేలు కన్న కీడు ఎక్కువ చేసినది. శ్రీ కృష్ణ కమిషన్ లాగానే ఫజల్ ఆలి కప్పదాటు సిఫార్సులు చేసి హైదరాబాదు రాష్ట్ర ఆంధ్రులకు ఆంధ్ర రాష్ట్ర ఆంధ్రులకు మధ్య చిచ్చుపెట్టారు.
హైదరాబాదు నుండి కన్నడ, మరాఠా ప్రాంతాలు విడగొట్టి మైసూరు, బొంబాయిలలో కలిపారు.
ఇప్పటి ఆంధ్ర ప్రదేశ్ రాష్త్రం 1956 లో ఏర్పాటు అయినది.
ఫజల్ వ్రాసిన రాతలు ఇప్పటికి రెండు ప్రాంతాల మధ్య విభేదాలకు మూలమయి రాష్త్రాన్ని ముక్కలు చేసే దిశగా నడుపు తున్నాయి.
తమిళులు ఆంధ్ర వారి క్రొత్త రాష్ట్రానికి రాజధాని నిమిత్తం ఇవ్వవలసిన సొమ్ము ఇవ్వకుండా మద్రాసు వారు ఎగ్గొట్టడానికి హైదరాబాదు ను తెలుగు వారి రాజధానిని చేసి నెహ్రు గారు 1956 లో ఆంధ్ర ప్రదేష్ రాష్ట్రాన్ని ఏర్పరచి ఉండవచ్చు.
తెలుగు వారు ఈ విధంగా కలసి పెద్ద రాజ్యమయి పోయి ఏకతాటిమీద ఉండి హిందుస్థానియులకు అనగా ఉత్తర భారతీయులకు అధికారం లో పోటీకి రాకుండా ఉందేటట్లు ఫజల్ అలి కమీషన్ లో చిచ్చు పెట్టి ఉండవచ్చు.
ఫజల్ ఆలి వ్రాతల ప్రతిఫలమే పెద్దమనుషుల ఒప్పందం.
నెహ్రు గారు రాజ్యాంగ రీత్య ఆంధ్ర రాష్ట్రము హైదరాబాదు రాష్ట్రము కలిపి ఆంధ్ర ప్రదేష్ ఎర్పరచి పెద్దమనుషుల ఒప్పందం పెరుతో ఆంధ్రాను విభజించినట్లయినది. ఎందుచేతనంటె పెద్దమనుషుల ఒప్పందములో ఉన్న షరతులన్ని కూడా రాజ్యాంగంలో పొందుపరచిన పౌర హక్కుల కు వ్యతిరేకమయినవే.
ఇప్పుడు అనగా షుమారు 60 సంవత్సరాల కలయిక తరువాత పూర్వపు కారణాలే చూపించి రాష్ట్రాన్ని విడదీయడం న్యూ ఢిల్లీ చారిత్రక తప్పు చేస్తుందనుకుంటున్నను.
అలా అప్పుడు ఫజల్ ఆలి పెట్టిన చిచ్చు 60 సంవత్సరాలు కలసి ఉండి కూడా తెలుగు వారు కలవకుండా చేసి ఆంధ్ర ప్రదేశం ఇప్పటికి రగులు తూనే ఉంది.