ఆర్ధిక సంస్కరణలు

Rate this page

మన దేశములో ఆర్ధిక విధాన సరళీకరణము షుమారు రెండు దశాబ్దాలక్రితము మొదలయినది. ఈ వ్యాసము ఎకనమిక్ టైమ్స్ లో 9.5.13 తేదీన ఉత్తరరూపములో నేను వ్రాయడమయినది. ఆర్ బీ ఐ గవర్నర్ పాకిస్తాను వారు పటించే వడ్డీరహిత ద్రవ్య మారకములు ఆధునిక వ్యాపారసరళికి అనుగుణమయిన విధానము కాదని ఆయన చెప్పడముతో ప్రతిస్పందించి నేను ఈ ఉత్తరమును వ్రాయడమయినది. తెలుగు మిత్రుల అనుకూలార్ధము ఈ వ్యాసమునకు తెలుగు అనువాదము వ్రాస్తున్నాను. 

ఈ ఆర్ధిక సంస్కరణల ప్రక్రియవలన మన దేశము పురోగతి చెందుతుందని చెబుతూవస్తున్నారు. అయినప్పటికి మనపాలకులు ఇప్పటికీ విదేశీ సంస్థాగత పెట్టుబడులకోసరము ఎందుకు అర్రులుచాస్తున్నారు? మనకు గల విదేశీ అప్పులను డాలర్లలో చెల్లించాలి. మనకు డాలర్లు కావలంటే మనము మనదేశమునుంచి వస్తువులను ఎగుమతిచెయ్యాలి. మన పరిశ్రమలు గత ఇరవై సంవత్సరములుగా కుదేలయిపోయినవి. మరియు గత మూడు సంవత్సరములుగా పారిశ్రామిక రంగము ఎదుగుదల ప్రతికూలదిశలో నడుస్తుంది.

ఆర్ధిక సంస్కరణలు

నా ఈ వ్యాసాలను కూడా చదవండి

మన దేశీయులు అమెరికాలోనూ గల్ఫ్ లోనూ ఉద్యోగాలు చేస్తూ ఇండియా పంపించే డాలర్లు సంవత్సరానికి షుమారు నాలుగు లక్షలకోట్లు ఉంటాయి. మనము దిగుమతిచేసుకునే క్రూడ్ ఆయిల్ బిల్లే 7,50,000 కోట్లు. అలాగే విదేశీ అప్పులకు వడ్డీలు తదితర చెల్లింపులు ఉంటాయి. రక్షణ పరికరాల దిగుమతులు ఉంటాయి. వీటన్నిటికోసం ప్రభుత్వము విదేశీ పెట్టుబడుల పేరును దేశ వనరులను సంస్థాగత పెట్టుబడుల రూపేణా అమ్మి ఆర్ధిక సంక్షోభమునుంచి తాత్కాలికంగా ఉపశమనమును పొందుతుంటుంది. 

నా వీడియోలను యుట్యుబ్ లో తిలకించండి

ప్రజల కొనుగోలు శక్తి తగిన స్థాయిలో ఉంచడానికిఅన్నట్లు అంచెలంచెలుగా బ్యాంకుల సి ఆర్ ఆర్ రేటును తగ్గిస్తూ సంవత్సరానికి షుమారు 45,000 నుంచి 70,000 కోట్ల్ సొమ్మును ఉద్పాదక రహిత రంగములకు ప్రభుత్వము జొప్పిస్తుంది. ఇది భారతీయులు విదేశీవస్తువులు కొనడానికే తప్ప ఉద్పాదక రంగానికి ఉపయోగము లేదు. 

నిజానికి దేశ ఆర్ధిక పరిస్థితి తత్కాల పరిష్కారములతో సడుస్తుంది. మన దేశములోని జాతీయ పరిశ్రమలు ప్రధానంగా చిన్న మధ్యతరగతి పరిశ్రమలు అధిక వడ్డీలవలన కుదేలయి మూతపడుతూపోతున్నాయి. వడ్డీరేట్లు తగ్గితేగాని భారతీయ చిన్న మధ్యతరగతి పారిశ్రామిక ఉద్పాదక రంగము కోలుకోలేదు.  పారిశ్రామిక రంగములో అభివృద్ధిలేకుండా దేశము ఏవిధముగా పురోగతి చెందుతుంది? ( ఎకనమిక్ టైమ్స్ లో 9.5.13 తేదీన జనార్ధన్ ప్రసాద్ వ్రాసిన వ్యాసమునకు తెలుగు అనువాదము.)

నా ఈ వ్యాసాలను కూడా చదవండి

ALSO READ MY ARTICLES ON

ప్రపంచ బ్యాంకు అప్పు

ఈ మధ్య బీజేపీవారు తాము అధికారములోకి వచ్చిన తరువాత ప్రపంచ బ్యాంకు నుంచి ఇండియా ఒక్క రూపాయి అప్పుకూడా అప్పుచెయ్యలేదు అని డాంబికాలు పలుకుతున్నారు.. అయితే ఎఫ్ డీఐ లు ద్వారా డాలర్లు రావడములేదా? ప్రైవేటుగా అంతర్జాతీయ సంస్థలవద్దనుండి అప్పుచెయ్యడములేదా? ఉదాహరణకు అహ్మదాబాద్ మెట్రోకొరకు 100000 కోట్లు జపాన్ వద్దనుంచి అప్పుచెయ్యడములేదా? వివిధ ప్రాజక్ట్ లకొరకు రాష్ట్రాలు అప్పుతేవడములేదా? వివిధ రాష్ట్రాలు  తెస్తున్న అప్పులు తమవి కాదన్నట్లు చెప్పడమువలన కేంద్రము అప్పుచెయ్యడములేదు అన్నట్లు కనిపిస్తుందేకాని అన్ని అప్పులూ మమూలుగా చేస్తూనే ఉన్నారు.


ఇక మన కేంద్ర ప్రభుత్వము తనకు తానుగా వరల్డ్ బ్యాంకు అప్పుచెయ్యకపోవడానికి కారణము క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గడము ఒక ఎత్తు అయితే పెట్రోల్ డీజల్ లపై పన్నులు అధికాధికంగా వసూలుచెయ్యడము రెండో కారణము అవుతుంది. 

2014 సం పూర్వస్థితిలోకి వెళితే 2011-12 లలో సంవత్సరమునకు ఒకటికి 910000 కోట్లు క్రూడ్ ఆయిల్ బిల్లు కేంద్రము భరించేది. ఈ బిల్లు 2014-15 కు రు. 687000 కోట్లకు తగ్గినది. అలా ఆ సంవత్సరములో 2,23,000 కోట్లు కలిసివచ్చినది. తరువాతి సం బిల్లు 4,18,000 కోట్లకు పడిపోయినది. 2016-17 సం కీ ఈ బిల్లు 4,70,000 కోట్లు. 2017-18 బిల్లు5,65,000 కోట్లు. అలా ఈ నాలుగు సంవత్సరములలో మనకు అనగా కేంద్రమునకు సంవత్సరమునకు 3,75,000 కోట్లు మొత్తానికి 15,00,000 కోట్లు క్రూడ్ ఆయిల్ బిల్లు భరించాల్సిన అవసరము లేకుండా పోయింది.

(అయితే ఒక విషయము మనము గుర్తుంచుకోవాలి, గత ఎనిమిది సంవత్సరములలో క్రూడ్ ఆయిల దిగుమతి విలువలలో మార్పు వచ్చిందేగాని ఆయిల్ పరిమాణము నిలకడగానే ఉంది. సంవత్సరానికి 180 నుంచి 200 మిల్లియను మెట్రిక్ టన్నులు క్రూడ్ ఆయిల్ దిగుమతి జరుగుతూనే వస్తుంది.) ఈ కలిసి వచ్చిన సొమ్ము పెరిగిన ఎలక్టానిక్ మెకానికల్ వస్తువుల దిగుమతికి ఉపయోగపడుతూవస్తుంది. అలానే యుద్ధ పరికరాల కొనుగోలుకు కూడా ఉపయోగపడినది. అలాగే మనదేశముతిరిగి చెల్లించాల్సిన అప్పులు తిరిగి కట్టడానికి దిగుమతుల బిల్లుల అవసరాలకు భారీగా ఉపయోగ పడినది.

ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్ మెంటు అనే విదేశీ పెట్టుబడులు 2014-17 మధ్యలో షుమారు రు. 740000 కోట్లు వచ్చిపడినవి. ఇదే 2010-14 ప్రాంతములో 650000 కోట్లు వచ్చినవి.

నా ఈ వ్యాసాలను కూడా చదవండి

అయితే విచారించవలసిన విషయమేమిటంటే కేంద్రానికి ఇంత కలిసివచ్చినాకూడా అదనపు ఆదాయముకొరకు ఈ నాలుగు సంవత్సరములూ ఒక క్రమపధ్ధతిలో ఎక్సైజు డ్యూటీ పెంచుకుంటూ పన్నుల రూపములో షుమారు 3,50,000 కోట్లు గడించింది.

అసలు ప్రభుత్వం అన్యాయంగా విధించే పన్నులను రద్దుచెయ్యమని ప్రజలతరపున ప్రాతినిధ్యము వహించే పార్లమెంటు సభ్యులు అడగాలి. 
ఇప్పుడు క్రూడ్ ఆయిల్ రేట్లు పెరుగడము మొదలుపెట్టినవి. తద్వారా దేశ ఆర్ధిక పరిస్థితి ఇబ్బందుల్లోకి వెళ్ళే అవకాశముఉంది. ఇకనుంచి దేశ ఆర్ధిక వ్యవస్థ, పురోగతి అంశములలో తిరోగమనము తప్పదు. అపుడు కేంద్రము క్రూడ్ ఆయిల్ బిల్లు గురించి చెప్పుకొచ్చి తమ తప్పులేదు అనవచ్చు. అదే విధానములో గత నాలుగు సంవత్సరములుగా క్రూడ్ ఆయిల్ బిల్లు తగ్గడమువలన దేశ ఆర్ధిక పరిస్థితి కుదుటపడినదని చెబుతుందా?!

డంకెల్ ముసాయిద

భారతదేశానికి సంప్రాప్తించే లాభనష్టాలను బేరీజువేసుకోకుండా ప్రపంచ వ్యాపార సంస్థ యొక్క  ప్రతినిధి డంకెల్ ముసాయిద పై భారత ప్రభుత్వం సంతకం చెయ్యడం  భారత దేశానికి ఆర్ధికం గాను, దేశీయం గాను, విదేశీయం గాను కూడ ఆత్మ హత్యా సాద్రుశ్యమే. #ఆడామ్ స్మిత్ అనే చరిత్ర కారుడు ఇలా అన్నడు, ” ఆమెరిక ఖండాన్ని కనుక్కోవడం మరియు భారత దేశానికి ఆఫ్రిక ఖండాన్ని చుట్టి వెళ్ళే సముద్ర మార్గాన్ని కనుక్కోవడం ఈ రెండు విషయాలు యూరోపియన్ల చరిత్రలొ మరువ లేని ఘట్టాలు.” 

నా ఈ పేజీలు  కూడా చదవండి

indian trade in the past 12.03.1993
indian trade in the past 12.03.1993

(ఈ ఉత్తరం డంకెల్ ప్రతిపాదనలకు స్పందనగా ది  12 / 03 /1993   తేదీన ఇండియన్ ఎక్స్ప్రెస్ లో వ్యాయడమయినది).

రష్యా చక్రవర్తి పీటర్ ౩౦౦ సంవత్సరాల క్రితం ఈ విధంగా అన్నాడు, ” భారత దేశ ఎగుమతుల వ్యాపారం అంటే ప్రపంచ వ్యాపారమే, ఎవరయితే భారత దేశ వ్యాపారాన్ని తమ గుప్పెట్లో పెట్టు కుంటారొ వారు యూరోప్ ఖండానికి  నియంత కావొచ్చు”.

అట్లాగె 1760 లొ లండన్ లొ ఒక స్త్రీ వద్ద ఇండియాలొ తయారు చేసిన జేబు రుమాలు ఉన్నందుకు 200 పౌండ్లు జరిమాన వసూలు చేశారట. మరి ఇప్పుడు( 1993) మన దేశ పరిస్థితి ఏమిటి? విసృంఖలంగా విదేశాల్లొ తయారు చేసిన వస్తువులు భారత దేశం లోకి అనుమతిస్తే పరిణామాలు దేశం ఎలా తట్టుకుంటుంది?

అసలు మన ప్రభుత్వం వద్ద ఏమయిన లెఖ్ఖలు వున్నాయా? ఎంత సరుకు దేశం లోకి వస్తుంది?

ఇప్పటి నుండి ప్రతి సంవత్సరం ఎంత సొమ్ము దిగుమతులకు బయటకు వెళుతుంది? దిగుమతులకు ధీటుగా మన దేశం ఎన్ని సంవత్సరాల్లొ దేశంలొ దేశీయ పరిజ్నానం తొ తయారు చేసిన వస్తువులు ఎగుమతి చెయ్యగలం? ఇలాంటి లెఖ్ఖలు భారత ప్రభుత్వం వద్ద ఉన్నాయా?
మన దేశం లొ దేశీయ పేటెంట్ల తో ఎప్పటికి మన స్వంత కర్మాగారాల్లొ వస్తువులు తయారు చేసి ఎగుమతి చెయ్యగలం?

ఇలాంటి లెఖ్ఖలు ఏమి లేకుండ ప్రపంచ వ్యాపార సంస్థ యొక్క  ప్రతినిధి డంకెల్ ముసాయిద పై భారత ప్రభుత్వం సంతకం చెయ్యడం  భారత దేశానికి ఆర్ధికం గాను, దేశీయం గాను, విదేశీయం గాను కూడ ఆత్మ హత్యా సాద్రుశ్యమే. 

పెట్రోలు డీజల్ ధరల పెంపు

పెట్రోలు డీజల్ యొక్క రిటైలు ధరలవిషయములో రెండు అంశములు మనము పరిగణలోకి తీసుకోవాలి. ఒకటి #పెట్రోలు #డీజల్ అమ్మకముపై పన్నును జీఎస్ టీ పరిగణలోకి ఎందుకు తీసుకురాలేదు. రెండు ఈ పెట్రోలు డీజల్ పై పన్నుల విధానము వలన రాష్ట్రములకు, కేంద్రమునకు ఎవరికి ఏమేమి లాభము. జనులు పెట్రోలు ధరగురించి గగ్గోలు పెడుతుంటారు. కాని డీజల్ ధరగురించి పట్టించుకోరు. పూర్వం డీజల్ ధర పెరిగినపుడు రాజకీయపార్టీలు, బాధ్యతగల విద్యావంతులు నిరసనలు వ్యక్తంచేసేవారు. ఇప్పుడు ఎక్కడా సౌండుఉండడము లేదు. ఇది ఒక విచారకరమయిన అంశము.

దీనికి కారణము ప్రభుత్వము అసలు విషయాలను దాచిపెత్తడమే. దీనినె స్టీరింగ్ ఆఫ్ పబ్లిక్ మైండ్ అంటారు. అంటే జనులు ఏవిషయము తెలుసుకోవాలో ఏఅంశము గురించి చర్చించాలో రాజకీయ పార్టీలు, పెద్ద వ్యాపారస్తులు నిర్ణయించి ప్రసార మాధ్యమాలద్వారా నియంత్రిస్తుంటారన్నమాట.

జీఎస్ టీ అంశమును పన్నుల పెరుగుదల తరుగుదల లేక ధరలు పెరుగుతాయా తరుగుతాయా అన్న అంశముగా చిత్రీకరించడము జరిగినది. నిజానికి ఇది దేశ ఫెడరలిజమ్ కు గొడ్డలి పెట్టులాంటిది. జీఎస్ టీ పన్నులన్నీ కేంద్రానికి చేరిపోతాయి. రాష్ట్రముల బొక్కసమునకు చిల్లుపెట్టి కేంద్రము రాష్ట్రముల ఆదాయమును తన బొక్కసములో ఈ జీఎస్ టీ ద్వార వేసేసుకుంటుంది. జీఎస్ టీ అమలు చెయ్యడానికి రాష్ట్రాలు అభ్యంతరము చెప్పాలి. కాని అది జరగలేదు.

జీఎస్ టీ విధానానికి ఒప్పుకుని రాష్ట్రములు తమ ఆర్ధిక స్వాతంత్ర్యమునకు పూర్తిగా తిలోదకాలు ఇచ్చివేసినవి. రాష్ట్రాలు అంత తెలివితక్కువగాఎందుకు వ్యవహరించినవి? పెట్రోలు డీజల్ లను జీఎస్ టీ పరిధిలోకి తీసుకుని రాకపోవడము వలన!

అలా రాష్ట్రములకు జీఎస్ టీ వలన సంక్రమిస్తున్న ఆదయ లోటును పూడ్చుకోవడానికి అవకాశము కలిగినది. పెట్రోలు డీజల్ అమ్మకములను జీఎస్ టీ పరిధిలోకి తీసుకువస్తే రాష్ట్రాలు జీఎస్ టీకి వ్యతిరేకంగా గొంతు పైకెత్తవచ్చు.

అంచేత ఇది పిల్లి ఎలుక చెలగాటములాంటిది. ప్రస్తుతము పెట్రోలియమ్ క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతుండడముతో కేంద్ర రాష్ట్రముల పన్నుల దొంగాట బట్టబయలు అవడము తధ్యము.

పెట్రోల్ డీజల్ అమ్మకములపై వేసిన పన్నులద్వారా 2013-14 లో కేంద్రమునకు 78000 కోట్లు రాష్ట్రములకు 129000 కోట్ల రూపాయిలు ఆదాయము వచ్చీది. 2016-17 నాట్కి కేంద్ర ఆదాయము 242000 కోట్లు, రాష్ట్రముల ఆదాయము 1,66,000 కోట్లరూపాయిలు ఉంది.

అనగా కేంద్ర ఆదాయము 310 శాతము పెరుగగా రాష్ట్రముల ఆదాయము 125 శాతము మాత్రమే పెరిగినది.ఈ విధముగా చూస్తే కేంద్రము రాష్ట్రాలను పన్నులు తగ్గించమనడము హాస్యాస్పదము. అందుచేత కేంద్రము వేస్తున్న పన్నులు వెంటనే తగ్గించుకుని పెట్రోలు డీజల్ ధరలను సమతుల్యపరిస్థితులలోకి తీసుకుని రావల్సిన అవసరము ఉంది. పెట్రోలు ధలలు తగ్గితే ప్రజలపై ఆర్ధిక భారము తగ్గితుంది. డీజల్ ధర తగ్గితే రవాణా ఖర్చులు తగ్గి ధరలు అదుపులో ఉంటాయి.

Facebook20
X (Twitter)20
LinkedIn20
Share
WhatsApp20