భారత దేశం ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలకు కారణం భారతీయులలో జాతీయతా భావ లేమి వలననే అని నేను భావిస్థున్నాను.గత 15 సంవత్సరాలుగా భారత దేశం సామాజికం గాను , రాజకీయం గాను మరియు సాంస్కృతికంగాను గతి తప్పి అధోగతి పాలవడం మనం గమనిస్తున్నాము.ఏ వ్యక్తి తమ చుట్టు ఏం జరుగుతుందొ గమనించడం లేదు.
సామాజిక కోణంలో ఆలోచిస్తే – ప్రజలు నైతిక విలువలు, #సనాతనధర్మం అన్ని ఫణంగా పెట్టి ధన సంపాదన , వ్యతిగత స్వార్ధం , భౌతిక సుఖాలు, ఆస్థి సమపార్జనల వైపు పరుగులు తీయడం గమనించవచ్చు.అయితె ఇక్కడ ఒక విషయం గమనించాలి.
ఈ విపరీత సామజిక పరిణామం 20 సంవత్సరాలు పైబడిన వారి లోను 38 సంవత్సరాలు లొపు వారి లొను ఎక్కువగా కానవస్తుంది. 12 నుండి 18 వయసు వారి లొ భారతీయ సంస్కృతి అంటే అభిమానం కానవస్తుంది. ప్రభుత్వాల యొక్క చర్యలు కూడ ఈ విపరీత ధోరణులకు దోహదం చేస్తున్నాయి. ఉదాహరణకు పాశ్చాత్య క్రైస్తవ సామాజ పద్దతిని ఒక క్రమ పద్దతిలో ఇండియాలొ జొప్పించడం జరుగుతుంది.
నా ఈ వ్యాసాలను కూడా చదవండి
రాజికీయంగా, శ్రీమతి ఇందిరా గాంధి తరువాత దేశం లో జాతీయుతా భావం అడుగంటింది. శ్రీ పి.వి.నరసింహరావు గారి 5 సంవత్సరాల పాలనలో జాతీయుతా భావం కొంత మిణుకు మిణుకు మంటూ ఉండేది. తరువాత పూర్తిగా అడుగంటింది.
జవహర్ లాల్ నెహ్రు గారు వ్యవసాయ అభివృద్ధికి ,ఆహార ధాన్యాల స్వయం సమృద్ధికి ఉపయోగపడే ఆనకట్టలు, నిర్మించడమే కాకుండా ఇనుము ఇతర లోహాలను తయారు చేసే భారీ పరిశ్రమలను స్థాపించారు.
నా ఈ వ్యాసాలను కూడా చదవండి
ALSO READ MY ARTICLES ON
- Indian Constitution
- Fundamental Rights
- Basic features of the Constitution
- Article 20
- Right to Life and Liberty
- Magna Carta
- England Bill of Rights
- American Bill of Rights
- French Bill of Rights
ఇందిర గాంధి రక్షణ పరికరాలు, ఉత్పత్తులు విషయాల్లొ స్వయం సమృధి కోసం వివిధ పరిశోధనా సంస్థలు, పరిశ్రమలు స్థాపించింది. భారత దేశ అభివృద్ది అక్కడితో ఆగిపోయింది.
ఇప్పుడు , భారతీయులు వాడే ఏ వస్తువైనా సరే ఇతర దేశాలనుండి దిగుమతి చేసుకోవాల్సిన అగత్యం పట్టింది. గృహల్లో వాడే వంట నూనె కూడా మనం దిగుమతి చేసుకుంటున్నాము గత 2 దశాబ్ధాలుగా.
పాశ్చాత్య క్రైస్తవ సామాజిక వ్యవస్థను అంతర్జాతీయ ప్రమాణముగా భారతీయులు నమ్మెవిధంగా ప్రభుత్వ చర్యలు ఉంటున్నాయి. దీనికి నిదర్శనం – ఒక క్రమ పద్దతిలో భారతీయుల కుటుంబ వ్యవస్థను దెబ్బ తీసే విధంగా చట్టాలు చెయడమే.
దిగుమతయ్యే కంప్యూటర్లు, విమానాలు, రక్షణ పరికరాలు, భారి యంత్రాలు గురించి ప్రక్కన పెడితే, భారతీయులు తాము కొంటున్న
కార్లు , మోటరు సైకిళ్ళు , సైకిళ్ళు , ఏ కంపినీదో, ఎంత ఖరీదు పెట్టి కొంటున్నమో అనే వాటి మీద పోటీ పడుతూ గొప్పలు పోతున్నారు. అవి దిగుమతి అవుతున్న వస్తువులని ఏమాత్రం గుర్తించడం లేదు.
నా ఈ వ్యాసాలను కూడా చదవండి
ఒకప్పుడు భారతీయులు తయారు చేసిన వస్తువులు ఎంత ప్రాముఖ్యంలో ఉండెవో ఎవ్వరు గుర్తు చేసుకోవడం లేదు. ప్రపంచ ప్రఖ్యాత చెందిన పురాతన సాంస్కృతి విలసిల్లిన సింధూ లోయలో 5000 సంవత్సరాల క్రితం ప్రపంచంలోనే ప్రప్రధమంగా దూది పండించి వస్త్రాలు తయారు చేసి ఎగుమతి చేసారు.
2000 సంవత్సరాల క్రితం ప్లైనీ అనే ఆయన రోమన్లు భారతదేశ వస్తువులు దిగుమతి చెసుకొవడం వల్ల రొమను దేశం నుండి బంగారం నిత్యం బారతదేశం తరలిపోతుందని వాపోయాడు.
నా ఈ పేజీలు కూడా చదవండి
- మహాత్మా గాంధీ 1869-1915
- జవహర్లాల్ నెహ్రూ 1889-1940
- డా. సర్వేపల్లి రాధాకృష్ణన్
- మోక్షగుండం విశ్వేశ్వరయ్య
నా వీడియోలను యుట్యుబ్ లో తిలకించండి