భారతీయ న్యాయ వ్యవస్థ లో మార్పులు చాల ఆవశ్యకమని చెబుతూ ఇండియన్ ఎక్స్ ప్రెస్ దినపత్రికలో 17.01.2002 ఈ ఉత్తరం వ్రాయడం జరిగింది. న అనిల్ దివాస్ అనే ఆయన జనవరి, 8 – 2002 తేదీన ప్రచురించిన ’చట్టం’ అనే వ్యాసానికి అనుకూలంగా ఈ ఉత్తరం నేను వ్రాశాను. అది సంపాదకులకు లేఖలు / శీర్షికలో Need of the hour (Page: Judicial Reforms)పేరున ప్రచురితమయినది. భారత దేశంలో అధికారికమైన అన్ని ఉద్యోగాలకు ఏదోవిధమైన పోటి పరీక్షలు ఉంటాయి. అయితే ఏ విధమైన పోటీ పరీక్షలు లెకుండా ప్రభుత్వ అధికారంలోకి నియమించబడేవారు,
1) హై కోర్టు మరియు సుప్రీం కోర్టు న్యాయమూర్తులు
2) మనకు చట్టాలు చేసే ప్రజా ప్రతినిధులు, మరియు
3) రాష్ట్ర గవర్నరులు
ప్రజా ప్రతినిధులు మరియు రాష్ట్ర గవర్నర్ల కు చదువుకు సంబంధించిన అర్హతలు ఉండాల్సిన అవసరం లేదు. హై కోర్టు మరియు సుప్రీం కోర్టు న్యాయమూర్తులు కొంత అనుభవం ఉండి ఉండే లాయర్లు అయితే వారు న్యాయమూర్తులుగా నియమించడానికి అర్హులు అవుతారు.
నా వీడియోలను వీక్షించండి
నా ఈ వ్యాసాలను కూడా చదవండి
హైకోర్టు , సుప్రీం కోర్టు న్యాయ మూర్తులను అధికార ప్రభుత్వం నియమిస్తుంది. ఈ హైకోర్టు , సుప్రీం కోర్టు న్యాయమూర్తులను అధికారం లొ ఉన్న ప్రభుత్వ తన ఇష్టాను సారం నియమిస్తుంది. అయితే జిల్లా కోర్టులకు , అంతకు క్రింది న్యాయ స్థానాలకు జడ్జిలుగా/ న్యాయమూర్తులుగా లిఖిత పూర్వక పోటి పరీక్షల్లో సఫలమయిన వారిని మాత్రమె రాష్ట్ర ప్రభుత్వాలు నియమిస్తాయి. మరి హైకోర్టు , సుప్రీం కోర్టు న్యాయమూర్తులను కూడ పోటీ పరీక్షలు ద్వార ఎందుకు నియమించకూడదు ?
నా ఈ వ్యాసాలను కూడా చదవండి
అయితే ఇదే అవసరాన్ని లేక ఆచారాన్ని ఇంజినీరింగు, వైద్యశాస్త్రీయ, పరిశోధన శాఖల మంత్రుల నియామకాల విషయల్లో పాటించలేదు, పాటించడం లేదు , ఎందుకని ? ఎంతో తెలివి తేటలు , విషయ పరిఙ్ణానం అవసరమయిన పరిశోధన శాఖల మంత్రి పదవికి ఏవిధమయిన చదువు లేకపొయినా అతను అర్హుడు అవుతున్నపుడు న్యాయశాఖ్హ మంత్రిగా ఎందుకు తప్పనిసరిగా ఎందుకు న్యాయ శాఖలో పట్టభద్రుణ్ణి మాత్రమె నియమిస్తున్నారు ?
ALSO READ MY ARTICLES ON
ఐ ఎ ఎస్ మాదిరి ఆల్ ఇండియ జూడిషియల్ సర్వీస్ ఒకటి స్తాపించి దానికి ప్రతి పట్ట భద్రుడు అర్హుడు అయ్యే విధంగ అంటె ఐ ఎ ఎస్ మాదిరి పోటి పరీక్షలు నిర్వహించాల్సిన సమయం ఆసన్నమయింది. ఈ విషయంలో చట్టంలో మార్పు తీసుకురావలసిన బాధ్యత పార్లమెంటు సభ్యులదె. అయితే ఇది ఎలా సాధ్యం అవుతుంది ? ప్రభుత్వం తన అధికారాల్ని కోల్పోవడనికి ఎందుకు ఒప్పుకుంటుంది. అలాంటప్పుడు పిల్లి మెడకు గంట కట్ట గలరు ?
మన చట్టాలు ఎంతో కాలం గా ఇలా ఘ్హనీభవించి ఉండడానికి మరో కారణం కూడ ఉంది. అది ఏమిటంటే మన ప్రభుత్వంలో కేంద్ర మంత్రుల నియామకం విషయంలొ మనం అనుసరిస్తున విధానమే . జవహర్ లాల్ గారు అపట్లో భారత దేశం క్రొత్తగా ఆవిర్భవించింది కావున మన చట్టాలు ప్రయొగ స్థాయిలొ ఉంటాయి కాబట్టి కేంద్ర న్యాయశాఖ మంత్రి న్యాయశాస్త్రంలో పట్టభద్రుడు అయి ఉంటే చట్ట సమస్యలు త్వరితంగా పరిష్కరించవచ్చనే ఆలోచన కావచ్చు న్యాయ శాఖ మంత్రి న్యాయ శాస్త్రం లొ పట్ట భద్రుణ్ణి నియమించే ఆచారం / సాంప్రదాయం మొదలు పెట్టారు.
నా ఈ పేజీలు కూడా చదవండి
- మహాత్మా గాంధీ 1869-1915
- జవహర్లాల్ నెహ్రూ 1889-1940
- డా. సర్వేపల్లి రాధాకృష్ణన్
- మోక్షగుండం విశ్వేశ్వరయ్య
నా వీడియోలను యుట్యుబ్ లో తిలకించండి
అయితే దీని వల్ల నష్టం ఏమిటి అనే ప్రశ్న వస్తే, నష్టం జరిగిందనే చెప్పవచ్చు. ప్రస్తుతం మనకున్నా చట్టాలు ఎపుడో బ్రిటీషు వారి వ్యాపార లాభాలకుఅనుకూలంగా చేసిన చట్టాలతోనే ఇప్పటికి మనం పాలింపబడుతున్నము అనేది గమనించాలి.
న్యాయ శాఖ మంత్రి ప్రజల ప్రతినిధిగా కన్న న్యాయ విద్య పట్టభద్రుడిగా వ్యవహరించే అవకాశం ఎక్కువ అవడంవల్ల చట్టాలు 200 సంవత్సరాలుగా ఘనీభవించి సామాన్య మానవునికి న్యాయం అందుబాటులో లేకుండాపోతుంది. ఈ మధ్య సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవీస్వీకర సభలో అన్న మాటలివి “మన దేశంలో క్రింది కోర్టులో 80 శాతం అవినీతిమయమయి ఉంది!”.
ఉదాహరణకు ఒక కేసు విచారణ క్రింది కోర్టులలోనే జరుగుతుంది. క్రింది కోర్టులొ తీర్పు వెలువరించాక జిల్లా కోర్టులో అప్పీలుకు వెళితే జిల్లా కోర్టు లొ ఏం చేస్తారంటె క్రింది కోర్టులొ విచారణ సరిగ్గా జరిగిందో లేదో పత్రాలు పరిశీలించి మాత్రమే తీర్పు ఇస్తుంది. తరు వాత హైకోర్టు లో అప్పీలు కు వెళితే విచారణ లో చట్టపరమయిన లొసుగులు ఏమయిన ఉన్నాయేమొ పత్ర రూపెణ చూసి తీర్పునిస్తుంది. సుప్రీంకోర్టులో రాజ్యాంగపరమయిన ప్రశ్నలను మాత్రమే విచారిస్తుంది. అనగా క్రింది కోర్టులొ జరిగిన విచారణను పునర్విచారణ హైకోర్టులో జరగదు. క్రింది కోర్టులు అవినీతి మయిమయినపుడు ( ప్రఢాన న్యాయమూర్తి మాటల్లో ) కేసు విచారణ పూర్తిగ క్రింది కోర్టులలొ జరుగే ఆచారం అనుసరిస్తున్నపుడు సామాన్యునికి న్యాయం ఎంతవరకు అందుబాటులో ఉంది అనేది ప్రశ్నార్ధకం అవుతుంది. అవినీతిని నియంత్రించాలంటే జవాబుదారి విధానం రావాలి. దీనికి పరిష్కారం అధికారంలొ ఉన్నవారంలొ ఉన్నవారు ప్రజలకు జవాబుదారులు కావలసి ఉంది . వీరిలో జవాబుదారి
నా ఈ వ్యాసాలను కూడా చదవండి
నా ఈ వ్యాసాలను కూడా చదవండి
ALSO READ
ఈ స్తోత్రములను కూడా చదవండి