ప్రజాస్వామ్య వ్యవస్థ మనుగడ?

Rate this page

లోక్ సభ మరియు రాజ్య సభలలో అణు ఒప్పందం విషయమై ప్రభుత్వం పార్చలమెంటు లో చర్చను అనుమతించడము లేదు. మన ప్రజాస్వామ్య వ్యవస్థ మనుగడ కు ఇది ప్రమాదకరము. అమెరిక దేశ ఆదేశాలను సిరసా వహించే  విదేశాంగ విధానం  కేంద్ర ప్రభుత్వం పాటించడానికి  ఉర్రూతలూగు తున్నట్లు విధితమవుతుంది. ఢిల్లీ లోని కేంద్ర ప్రభుత్వం అమెరికా తో అణు ఒప్పందం వ్యవహారంలో ఏకపక్షంగ వ్యవహరిస్థున్న తీరు విస్మయం కలిగిస్తుంది.

(ఈ విశేషాంశం గురుంచి ముఖ్యమయిన తెలుగు, ఇంగ్లీషు వార్తా పత్రికలకు, తెలుగు, ఇంగ్లీషు, హింది టి.వి చానళ్ళకు ది 21.09.07 తేదీన పంపించడమయినది.) 

ఈ విధానం వల్ల దేశానికి ఏ దుస్థితి వస్థుందొ హెన్రి కిస్సింజర్ అనే పూర్వపు అమెరిక విదేశాంగ శాఖ మంత్రి మాటల్లో చూద్దాం, ఆయన ఏమని చెబుతాడంటె ” అమెరిక దేశం తొ ఏ దేశ మయితే స్నేహం చేస్థుందో ఆ దేశాన్ని అమెరికా సైనికంగ ఆక్రమిస్థుంది”. ఈయన చెప్పిన మాటలు ఎల్లప్పుడు అన్ని దేశాల విషయాలలో నిజమవుతుందని చరిత్ర చెబుతుంది.

ప్రజాస్వామ్యం,ప్రజాస్వామ్య వ్యవస్థ మనుగడ,ప్రజాస్వామ్య వ్యవస్థ

నా ఈ వ్యాసాలను కూడా చదవండి

అమెరికా తో చేతులు కలిపితే ఏమవుతుందో తెలిసి కూడ  ప్రభుత్వం పార్లమెంటును త్రోసిరాజని ఎలా ముందుకు వెళ్ళగలుగుతుంది? ప్రభుత్వానికి ఇంతటి నిరంకుశ అధికారాలు రాజ్యాంగ పరంగ ఎలా దఖలు పడ్డాయో పరిశీలిద్దాం. 

నా వీడియోలను యుట్యుబ్ లో తిలకించండి

 భారత దేశం ఒక గణ తంత్ర, ప్రజాస్వామ్య  రాజ్యంగ ౧౯౫౦ లొ ఏర్పడింది.
భారత రాజ్యాంగ నిర్మాతల్లో ప్రధాన భూమిక పోషించిన జవహర్ లాల్ నెహ్రు గారు మన ప్రజాస్వామ్య వ్యవస్థ గురుంచి ఏమన్నరంటె , ” మన ప్రజాస్వామ్యం బ్రిటిషు వారి వెస్ట్ మినిస్టర్ వ్యవస్థను పోలి ఉంటుంది”.  అంటే,  కేంద్ర మంత్రులు, ప్రధాన మంత్రి పార్లమెంటుకు జవాబుదారి గ ఉండాలి. 

నా ఈ వ్యాసాలను కూడా చదవండి

ఈ చట్టం ౧౯౪౦ లో కూడ అమలులో ఉంది. అయినాసరే పైన చెప్పిన విధంగా అప్పటి కాంగ్రెసు సభ్యులు రాజనామాలు చేసి దేశానికి ఎలాంటి ప్రజాస్వామ్య వ్యవస్థ మున్ముందు  ఉండబోతుందో దేశ ప్రజలకు రుచి చూపించారు అనిమనం గమనించాలి.

నా ఈ పేజీలు  కూడా చదవండి

మన పూర్వీకులు  ఎంతటి ప్రసస్థమయిన ప్రజాస్వామిక విలువలు మనకు వారసత్వంగా ప్రసాదించారు! ఇప్పుడు మనం ఏమి చేస్థున్నాం ? పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థను అపహాస్యం పాలు చేస్థూ ప్రభుత్వం నిరంకుశం గా వ్యవహరిస్థుంటే పార్లమెంటు సభ్యులు కళ్ళప్పగించి చూస్థున్నారు. పార్లమెంటుకు ప్రజలకు విధేయులయి ఉండాల్సిన ప్రజా ప్రతినిధులు రాజకీయపార్టీ ల అధ్యక్షులకు  విధేయులయి పదవులను కాపాడుకోవడమే జేవిత పరమావధిగా భావిస్థున్నారు.

నా ఈ వ్యాసాలను కూడా చదవండి

ఇక్కడ మరో విషయం గమనించాలి. మన ప్రస్థుత రాజ్యాంగం ఆర్టికల్ ౧౩ ప్రకారం రాజ్యాంగం అమలులోకి వచ్చిన తరువాత పూర్వపు చట్టాలు ఏవయిన రాజ్యాంగ అధికరణాలకు వ్యతిరేకంగా ఉంటే అవి చేల్లవు. అనగా కేంద్ర ప్రభుత్వానికి పార్లమెంటును తలదన్ననే అధికారాలు ఏమి చెల్లవు. 

పార్లమెంటు లో మూడవ వంతు సభ్యులున్న పార్టి దేశ రక్షణ వ్యవహారంలో ఏకపక్ష నిర్ణయం తీసుకొని వ్యవహారం నడిపించడం దేశ రాజకీయ దుస్థితికి నిదర్శనంగా భావించవచ్చు.

ALSO READ MY ARTICLES ON

Facebook20
X (Twitter)20
LinkedIn20
Share
WhatsApp20