రాజకీయ పార్టీ అధినేతల నియంత్రుత్వ ధోరణికి మూలము, బలము పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టమే. అందుచేత పార్టీ పిరాయింపుల నిరోధక చట్టమును నిరోధిస్తే గాని మన ఎంపీలు ఎంఎల్యేలు పార్లమెంటులోను, అసెంబ్లీలోను స్వతంత్ర్యంగా వ్యవహరించి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజనను అడ్డుకోలేరు. 4.10.13 తారీఖు ముందురోజు రాత్రి కేంద్ర ప్రభుత్వం మంత్రి మండలిలో రాష్ట్రాన్ని విభజించడానికి అనగా ఆంధ్ర ప్రదేశ్ రాష్త్రం నుంచి పూర్వపు హైదరాబాదు రాష్ట్రాన్ని విడదీసి వేరే రాష్ట్రం గా ఏర్పాటు చెయ్యడానికి సన్నహాలు మొదలుపెడుతున్నట్లు న్యూఢిల్లీలో ప్రకటన చేశారు.
దీని పర్యావసానం ఏమిటంటే ముందు విభజన ప్రతిపాదనను దేశాధ్యక్షునికి పంపుతారు.
ఆయనా ఆ ప్రతిపాదనను రాష్ట్ర అసెంబ్లీకి పంపుతారు.ఒకవేళ అసెంబ్లీ అంగీకరిస్తే వచ్చే శీతాకాల పార్లమెంటు సమావేశాలలో రాష్ట్ర విభజన తీర్మానం ప్రవేశపెడతారు.
నా ఈ వ్యాసాలను కూడా చదవండి
హదరాబాదు రాష్ట్రములోని తెలంగణా ప్రాంతం వారికి తీర ఆంధ్ర జిల్లాల వారీ ఉద్యోగ అవకాశాలు విషయమై సయొధ్య కుదిర్చిన ఆర్టికల్ 371 డి రాజ్యాంగం లో భాగంగా ఉండగా రాష్ట్ర విభజన ప్రతిపాదన అసెంబ్లీలో ఎలా ప్రవేసపెడతారు. ఇది రాజ్యాంగ విరుద్దం కదా!
నా ఈ పుస్తకమును చదువదలచిన వారు నా సెల్ ఫోన్ నంబర్ 9866357268 కు Phone Pay ఫోన్ పె ద్వారా రు. 450/- పంపించి పోస్టల్ అడ్రసు తెలియ జేస్తూ వాట్మెసాప్ మెసేజ్ పెడితే పోస్ట్ ద్వారా పుస్తకము పంపబడును.
లేదా
పుస్తకమును Amazon అమెజాన్ ద్వారా కొనుగోలు చేయుటకు ఈ లింకు పై క్లిక్ చెయ్యండి. https://www.amazon.in/dp/B0CTSP19X3?ref=myi_title_dp అమెజాన్ ద్వారా వెల రు. 450/-
నా వీడియోలను యుట్యుబ్ లో తిలకించండి
ఒకవేళ ఆర్టికల్ 371 డి ను రాజ్యాంగంలోచి తొలగించాలంటే పార్లమెంటులో 2 / 3 వంతు మెజార్టీ కావాలి కదా!పార్లమెంటులోను, అస్సెంబ్లీలోను తీర్మానం పాస్ చెయ్యడానికి చాలా రాజకీయాలు జరుగ వచ్చు. కొందరు ఎమ్ ఎల్ ఏ లు, ఎం పీ లు సభకు గైరు హాజరవడం ద్వారా తీర్మానం నెగ్గవచ్చు. ఎలానంటే అస్సెంబ్లీలో హాజయిన వారి ఓట్లలో మెజారిటీ సాధిస్తే తీర్మానం నెగ్గుతుంది. కొందరు ఎమ్ ఎల్ ఏ లు, ఎం పీ లు ఇప్పటికే రాజినామ చేసి వారు వోటు వెయ్యడానికి అర్హత కోల్పోయి ఉంటే వారి ఓటు ఎలాగు తీర్మానానికి వ్యతిరేకం కాబట్టి అధికార పార్టీ కి మేలవుతుంది. అంటే ఒకవిధంగా విభజనను వ్యతిరేకిస్తున్నామని చెప్పి రాజినామా చేసినవారు వోటు వెయ్యకపోవడం ద్వారా విభజన తీర్మానాన్ని బలపరిచినవారు అవుతారు.
నా ఈ వ్యాసాలను కూడా చదవండి
ఇక చట్ట సభలలో హాజరయిన వారు ఓట్లు ఎటువెస్తారో తెలియదు. తీర్మానాలను నెగ్గించుకోవడానికి కాంగ్రెసు శతవిధాలా ప్రయత్నిస్తుంది.
ఇప్పటికే రాజకీయ పార్టీల అధిపతులు ఈ విషయమై ఒక నిర్ణయానికి వచ్చేశారనుకొంటున్నాను. ఎమ్ ఎల్ ఏ లు, ఎం పీ లు పార్టీ నిర్ణయాలను నిజాయితీగా ధిక్కరించే స్థోమతు ఉన్నవారు కనబడుటలేదు.
నా ఈ వ్యాసాలను కూడా చదవండి
ఎవరు నిజంగా సమైక్యం వైపు ఉన్నరో ఎవరు విభజనకు భజన చేస్తున్నరో అందరికి అర్ధమవుతూనే ఉంది.
ఎమ్ ఎల్ ఏ ల, ఎం పీ ల కుటిల రాజకీయాన్ని నిలువరించడం ఎలా సాధ్యం ?
విభజనను విజయవంతంగా ప్రతిఘటించడం ఎలా అన్నదే సమస్య. ఎమ్ ఎల్ ఏ లు, ఎం పీ లు పార్టీ అధిష్టానానికి బానిసలుగా ఎలా అయ్యారో ఒకసారి వివరాల్లోకి వెళదాం
ఒక ప్రక్క ఏ రాజకీయ పార్టీ కూడా తమ ఎమ్ ఎల్ ఏ లు, ఎమ్ పీ లు పార్టీ అధిష్టానం తీసుకొనే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తారేమో అని భయపడటం లేదు.
మరో ప్రక్క ఎమ్ ఎల్ ఏ లు ఎమ్ పీ లు ప్రజలు ఏమనుకొంటారో, మళ్ళీ ప్రజలు మనకు ఓట్లు వేస్తారొ లెదో అని భయపడటం మానివేశారు. ప్రజలు డబ్బులకు ఓట్లు వేస్తారు. పార్టీలకు ఓట్లు వేస్తారు. మమ్మల్ని చూసి కాదు. అయిదు, పది శాతం ఓట్లు విజయాన్ని నిర్ణయిస్తాయి. ఆ ఓట్లు ఎలా వేసుకోవాలో, వేయించుకోవాలో మాకు తెలుసు. అయినా గాని పార్టీలు టిక్కట్లు ఇవ్వకపోతే పోటీ చెయ్యడనికే ఉండదుకదా. అందుచేత పార్టీ నిర్ణయానికి శిరసావహించడం తప్పుకాదు. ప్రజలు ఎక్కువకాలం ఏదీ గుర్తుంచుకోరు. ఇలాంటి ఆలోచనలతో ఎమ్ ఎల్ ఏ లు ఎమ్ పీ లు ప్రజాభిప్రాయాన్ని ప్రక్కనపెడుతున్నారా ? ఇంకా ఏమయినా కారణాలు ఉన్నాయా ?
ఇక్కడ ఒక విషయం గమనించాలి. పూర్వం ఇందిరా గాంధి, నెహ్రూ ల కాలంలో కూడా ప్రజాభీష్టాన్ని ప్రక్కకు పెట్టి నిర్ణయాలు జరిగిఉంటాయి.
కాని ఆ మహానాయకుల నిర్ణయాలు దేశం మేలు కోరి తీసుకున్నవే కాని స్వార్ధ రాజకీయాలకు కాదు. కాని ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర విభజన ఓ రెండు డజన్ల ఎంపీ సీట్ల కోసం చేస్తున్నరని దేశమంతా విశదమయింది.
52 వ రాజ్యాంగ సవరణ
అయినా సిగ్గు పడకుండా, తీర్మానం వీగిపోతే ఎలా అనె భయం లేకుండా ఈ విభజన ప్రక్రియను ఏ ధైర్యంతో కాంగ్రెసు పార్టీ ముందుకు ఎందుకు తీసుకువెళుతుంది ?
28 సంవత్సరాల క్రితం జరిగిన ఒక రాజ్యాంగ సవరణ దీనికంతకు కారణమని భావిస్తున్నాను. ఈ రాజ్యాంగ సవరణ నిజానికి మన దేశంలో ప్రజాప్రతినిధుల్ని రంగులు మార్చకుండా నియంత్రించడానికన్నట్లు తీసుకురావడమయినది.
ఈ రాజ్యాంగ సవరణనే పిరాయింపు నియంత్రణ చట్టం అంటారు. ఇది మన రాజ్యాంగానికి యాభైరెండ ( 52 ) వ సవరణ . ఈ చట్టాన్ని 1985 లో తెచ్చారు. ఈ యాభై రెండవ సవరణ రాజ్యాంగంలో ఆర్టికల్స్ 102 (2) & 191 (2) ల ను సూచిస్తుంది.
ఇది రాజ్యాంగంలో 10 వ షెడ్యూలు గా వ్యవహరిస్తారు. దీని ప్రకారం ఒక చట్ట సభ సభ్యుడు తాను ఏ పార్టీ టిక్కట్టు పై ఎన్నికవుతాడో ఆ పార్టీ ఆదేశాలకు అణుగుణంగానే మాట్లాడాలి ఓటువెయ్యాలి. అలా కాకుండా ఎమ్ పీ గాని ఎమ్ ఎల్ ఏ గాని తన స్వంత అభిప్రాయాన్ని పార్లమెంటులో లేక అస్సెంబ్లీలో వ్యక్తం చేశాడో అప్పుడు అతణ్ణీ పార్టీ నుండి బహిష్కరిస్తారు. తద్వారా అతను తన చట్ట సభల సభ్యత్వాన్ని కోల్పోతాడు.
ఈ చట్టం రాజ్యాంగ వ్యతిరేకమని చాలా చర్చలు జరిగినవి. మరియు కొన్ని కోర్టు తీర్పులు కూడ ఈ చట్టానికి వ్యతిరేకంగా వచ్చినవి. రాష్ట్రాలు ఈ సవరణను సమ్మతిస్తూ తీర్మానాలు చెయ్యలేదు.
కాని ఈ ఆర్టికల్ అమలు అలాగే కొనసాగుతుంది.
ఈ చట్టం భారత పౌరులుగా ఎమ్ ఎల్ ఏ, ఎమ్ పీ ల కు రాజ్యాంగం ప్రాధమిక హక్కుల, ఆర్టికల్ 19 ( ఎ) ద్వారా ప్రసాదించిన భావ వ్యక్తీకరణ స్వేచ్చను హరించివేసింది.
అదియును గాక పార్లమెంటు మరియు అస్సెంబ్లీల స్పీకర్ లను రాజకీయ పార్టీ బాస్ లకు గుమాస్తాలుగా చేసింది.
నా ఈ పేజీలు కూడా చదవండి
- మహాత్మా గాంధీ 1869-1915
- జవహర్లాల్ నెహ్రూ 1889-1940
- డా. సర్వేపల్లి రాధాకృష్ణన్
- మోక్షగుండం విశ్వేశ్వరయ్య
ఎన్నికయిన ప్రతి ఎమ్ ఎల్ ఏ, ఎమ్ పీ తనను ఓట్లు వేసి ఎన్నుకున్న నియోజక వర్గ ప్రజలకు విశాలంగా అలోచిస్తే దేశానికి మరియు రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించి తన కర్తవ్యాలు నెరవేర్చాల్సింది పోయి రాజకీయ పార్టీ అధిష్టానం యొక్క స్వార్థప్రయోజనాలు తీర్చడానికి పనిచేసే విధంగా మారిపోయింది.
ఈ చట్టం వాస్తవానికి అమలులో ఉండాల్సినది కాదు. ఈ చట్టాన్ని 1985 లో పార్లమెంటులో పాస్ చేశారు గాని రాష్ట్రాలు రాటిఫై చెయ్యలెదు. అనగా ఇంతవరకు రాష్టాలు ఈ చట్టానికి వాటి ఆమోదం తెలపలేదు. ఆ విధం గా చూసినా దీని అమలు రాజ్యాంగవిరుద్ధమే.
ఇలా ఈ పార్టీ పిరాయింపు చట్టం మంచి ఉద్దేశ్యం తో తీసుకువచ్చినా నిజానికి ఇది కాలక్రమేణా మన ప్రజాస్వామ్య వ్యవస్తను నిర్వీర్యం చేసింది.
ఎమ్ ఎల్ ఏ లు ఎమ్ పీ లు పార్టీ బాస్ లకు బానిసలుగా మారి ప్రజలకు పూర్తిగా దూరమయ్యారు. ప్రజాభిప్రాయానికి విలువలేకుండా పోయింది.
ఈ చట్టం అమలులో ఉన్నంత కాలం మన ఎమ్ ఎల్ ఏ లు , ఎమ్ పీ లు పార్టీ లకు బానిసలు గానే వ్యవహరిస్తారు.. కావున తెలుగు వారికి పార్లమెంటు లోను అస్సెంబ్లీ లోను ప్రజాస్వామ్యంగా న్యాయం జరగాలంటే తెలుగు వారు ఈ చట్టాన్ని రద్దు చేయడానికి ఉద్యమించాలి.
ఇలా పార్టీ పిరాయింపుల చట్టాన్ని తొలగించాలని ఉద్య మించడం ద్వారా తెలుగు వారు విజయం సాధిస్తే భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థను పునరుజ్జీవింప చేసినవారవుతారు.
ALSO READ MY ARTICLES ON