మోక్షగుండం విశ్వేశ్వరయ్య

Rate this page

శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు పూర్వపు భారత దేశము లో ప్రముఖ ఇంజనీరు. ఈయన కోలారు జిల్లాలోని ముద్దెనహల్లి గ్రామములో 15.9.1860 లో జన్మించారు. ఆయన తెలుగు బ్యాహ్మణ కుటుంబానికి చెందిన వారు. అప్పట్లే ఈ ప్రాంతము ఆంధ్రలోనిది. ప్రస్తుతము కర్నాటక రాష్ట్రము లోనికి వెఌనది. ఈయన తొలుత బెంగళూరు సెంట్రల్ కాలేజీలో బిఏ చదివి తరువాత పూనా ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ పట్టాతీసుకున్నారు.

ఆయన తొలి ఉద్యోగము బొంబాయి మునిసిపాలిటీలో. తరువాత ఆయన సెంట్రల్ ఇర్రిగేషన్ కమీషన్ లో పని చేశారు. అలా ఆయన దక్కను వరద నివారణ పనులలో ప్రముఖ పాత్ర వహించారు. 1903  లోఆటోమ్యాటిక్ ఫ్లడ్ గేట్లను తయారు చేసి పేటంట్ తీసుకొన్నారు.

నా ఈ వ్యాసాలను కూడా చదవండి

ఔరంగాబదు హిందుస్థానికి దగ్గరగా ఉంటుంది. అందుచేత హిందుస్థానీలు ( హిందువులు మరియు ముస్లిములు) బంగాలీలు నిజాము కొలువులో ఎక్కువగా ఉండే వారు. 

మోక్షగుండం విశ్వేశ్వరయ్య,ముద్దెనహల్లి గ్రామము,ముద్దెనహల్లి,గ్రామము,మోక్షగుండం,విశ్వేశ్వరయ్య,మూసీ నది,ఇంజనీర్స్ డే,కన్నడ జాతి పిత

తొలిగా ఈ గేట్లను పూనే లోని ఖడక్వస్ల బ్యారేజ్ కు అమర్చారు. తరువాత గ్వాలియర్ లోని తిగ్రా డాముకు, మరియు మైసూర్ లోని కృష్ణరాజ సాగర్ డామ్ కు అమర్చారు. బృందావన్ గార్డన్స్ ఈ డామ్ కు దిగువనే ఉంటాయి.

నైజాం అభ్యర్ధనపై శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు మూసీ నది కి వరదలు నివారించడానికి హైదరాబాదు నీటి సమస్య తీరడానికి గండిపేట చెరువు, హుస్సేన్ సాగర్ చెరువులను అబివృద్ధి చేశారు.

ALSO READ MY ARTICLES ON

భద్రావతిలో మైసూర్ ఐరన్ అండ్ స్టీల్ ఫ్యాక్టరీ, మైసూర్ సోప్ ఫ్యాక్టరీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, బంగళూర్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ, తదితర సంస్థలన్ని ఆయన ఆధ్వర్యములో పురుడు పోసుకున్నవే. కర్నాటక వారు ఆయనను ఆధునిక కన్నడ జాతి పితగా కొనియాడతారు.

image 41
Krishnaraja Sagar Dam (Brindavan Gardens, Mysore)

1955 లో ఆయనకు భారత ప్రభుత్వము భారత రత్న ఇచ్చి గౌరవించినది.

భారతీయులు శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి పుట్టిన రోజును ఇంజనీర్స్ డే గా సెలబ్రేట్ చేసుకుంటారు.

నా ఈ వ్యాసాలను కూడా చదవండి

ఈ పేజీలు  కూడా చదవండి

Facebook20
X (Twitter)20
LinkedIn20
Share
WhatsApp20