రామ మందిరం బాబ్రి మసీదు

Rate this page

ఒకప్రక్క బి.జె.పి పార్టి రామ మందిర నిర్మాణార్ధం పురాతన బాబ్రి మసీదు కూల్చివేయడం ఒక చారిత్రక తప్పిదాన్ని సరిచేయడమేనని ప్రకటించిన తరువాత కూడా అద్వాని విచారం వ్యక్తం చేయడం హాస్యస్పదంగా ఉంది. ఇలా చారిత్రకంగా మతపరమయిన సంఘటనలు చాలా ఉన్నాయి. వాటినన్నిటిని సరిచేయడానికి బి.జె.పి ముందుకు వస్తుందా? 1)  టిప్పు సుల్తాను తాను మైసూరు మహరాజుగా ఉన్నప్పుడు శృంగేరి మఠంలో ఉంచడానికి గాను సరస్వతీ విగ్రహం తయారు చేయడానికి బంగారం దానం చేసి ఉన్నాడు. ఆ విగ్రహాన్ని 1761 లో మరాఠా ముఠాలు దొంగిలించి, కరిగించి బంగారం పంచుకున్నట్లుగా చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఇప్పుదు బి.జె.పి ఆ బంగారం శృంగేరి మఠానికి ఇచ్చివేస్తుందా?

2)  దేశం మొత్తంలో వేలవేల సంఖ్యలో,  వెయ్యి సంవత్సరాల క్రితం జైన , భౌద్ధ ఆలయాలు, హిందూ ఆలయాలుగా మార్చబడ్డాయి. ఇప్పుడు వీళ్ళు వాటిని  జైనులకు,భౌద్ధులకు ఇచ్చివేస్తారా ?

రామ మందిరం,బాబ్రి మసీదు,రామ మందిరం బాబ్రి మసీదు

నా ఈ వ్యాసాలను కూడా చదవండి

బాబ్రి మసీదు కూల్చిన తరువాత ఇంగ్లాండులోను, పాకిస్తానులోను హిందు దేవాలయాలను అపవిత్రం చేయడాంగాని, విధ్వంసం చెయ్యడం గాని జరిగింది. ఇలాంటి విదేశాల్లో జరిగిన ప్రతి చర్యలకు హిందూ అతివాదులు బాధ్యత వహిస్తారా ? అలాగే బోంబాయి తదితర ప్రదేశాల్లో జరిగిన నరమేధం వీరి పాపంగానే పరిగణించాల్సి ఉంటుంది కదా ? అంచేత హింసకు హింస సమాధానం కాదు. ప్రజాస్వామ్య పధ్ధతులను వదిలి హింసయే ప్రధాన ఆయుధంగ  గల రాజకీయ పార్టిలు భారతీయ సమాజంలొ ఎక్కువ కాలం నిలువ లేవు. 

Facebook20
X (Twitter)20
LinkedIn20
Share
WhatsApp20