జవహర్‌లాల్ నెహ్రూ 1938-52

Rate this page

ప్రావిన్షియల్ కౌన్సిళ్లను సంప్రదించకుండా 23 అక్టోబర్ 1939 న, వైస్రాయ్ భారతదేశం యుద్ధంలో పాల్గొంటున్నట్లు ప్రకటించాడు. రాష్ట్రాల ప్రతినిధులను సంప్రదించకుండా వైస్రాయ్ చేసిన ప్రకటనను కాంగ్రెస్ ఖండించింది. మరియు వైస్రాయ్ నిర్ణయాన్ని నిరసిస్తూ కౌన్సిల్ ప్రతినిధులంతా రాజీనామా చేయాలని కాంగ్రెస్ మంత్రిత్వ శాఖలకు పిలుపునిచ్చారు.

(ఈ పేజీకి ముందు పేజీ జవహర్‌లాల్ నెహ్రూ 1889-1940 మరియు చివరి పేజీ జవహర్ లాల్ నెహ్రూ 1948-64 కూడా చదవండి.)

ఈ ప్రకటనకు ముందు, వైస్రాయ్‌కు వ్యతిరేకంగా ప్రదర్శనలలో పాల్గొనాలని జిన్నా మరియు ముస్లిం లీగ్‌ను నెహ్రూ కోరారు. కానీ నెహ్రూ అభ్యర్థనను జిన్నా తిరస్కరించారు. ఇదిలా ఉండగా,

సింధ్ ప్రావిన్షియల్ కౌన్సిల్, 1939 లో పాకిస్తాన్ ను ఏర్పాటు చెయ్యాలని తీర్మానాన్ని ఆమోదించింది. హిందూ మహాసభ మరియు ముస్లిం లీగ్ లు సింద్ ప్రభుత్వంలో అపుడు అధికారాన్ని పంచుకుంటున్నాయి. ఆ తరువాత మార్చి 1940 లో, ముస్లిం లీగ్ లాహోర్లో “పాకిస్తాన్  ఏర్పాటును కోరుతూ తీర్మానం” ను చేసింది, “దేశ నిర్వచన ప్రకారం ముస్లింలు ఒక దేశం, మరియు మత ప్రాతిపదికన వారికి వారి ఇల్లు, వారి భూభాగం మరియు వారి రాష్ట్రం వారికి ఉండాలి” అని ప్రకటించారు. ఈ తీర్మానాలలో ముస్లిముల రాష్ట్రానికి పాకిస్తాన్ అని పేరు పెట్టారు. లాహోర్లో ముస్లిం లీగ్ నాయకుడు తీసుకున్న తాజా నిర్ణయం నేపథ్యంలో “పాత సమస్యలన్నీ కనుమరుగై పోయి … దేశం నిస్తేజం అయిపొయింది” అని నెహ్రూ కోపంగా ప్రకటించారు.

క్విట్ ఇండియా ఉద్యమం,ఆల్ ఇండియా స్టేట్స్ పీపుల్స్ కాన్ఫరెన్స్,“భారత రాజ్యాంగం”,రాజ్యాంగ అసెంబ్లీ,జమీందారీల రద్దు,జవహర్‌లాల్ నెహ్రూ 1938-52

నా ఈ వ్యాసాలను కూడా చదవండి

పాకిస్తాను ఏర్పాటు కొరకు అంబేట్కర్ పుస్తకం

మరియు డా. బి . ఆర్. అంబేత్కర్ 1940 లో “పాకిస్తాను గురించిన ఆలోచన” (Thoughts on Pakistan) అను పుస్తకాన్ని విడుదల చేశారు. ముస్లిములకు ఒక ప్రత్యేక దేశంగా పాకిస్తాన్ ను ఏర్పాటు చెయ్యాల్సిన ఆవశ్యకత గురించిన చర్చను ఆయన ఆ పుస్తకంలో చేశారు. పాకిస్తాన్ ఏర్పాటుకు కాంగ్రెస్ అంగీకరించాలి అని ఆయన వాదించారు. భారతదేశాన్ని పాకిస్తాన్ భారత్ అను రెండు దేశాలుగా విభజించి చూపించే భౌగోళిక పటాన్ని ఆయన తయారు చేసి చూపించారు. తరువాత, శ్యాం ప్రసాద్ ముఖేర్జీ 1946 లో  భారతదేశాన్ని విభజించినా విభజించక పోయినా  బెంగాల్‌ను మాత్రం మత ప్రాతిపదికన విభజించాలని పేర్కొంటూ 1947 మేలో మౌంట్ బాటన్‌కు ఒక లేఖ రాశారు.

నా ఈ వ్యాసాలను కూడా చదవండి

ఇక స్వాతంత్ర్య సంగ్రామం విషయానికి వస్తే, మొదట్లో గాంధీ యుద్ధ సమయంలో బ్రిటిష్ వారు ఇచ్చిన మద్దతును బేషరతుగా ఇవ్వాలని మరియు అది అహింసాత్మకంగా ఉండాలని చెప్పారు. కానీ నెహ్రు గాంధీ యొక్క ఆలోచనను ఎద్దేవా చేశాడు. యుద్ధం సమయంలో అహింస గురించి మాట్లాడడం అర్థం లేని పని అని, నాజీయిజానికి, ఫాసిష్టులకు వ్యతిరేకంగా జరుగుతున్న ఈ యుద్ధంలో భారత్ బ్రిటన్‌కు మద్దతు ఇవ్వాలి అని, కానీ భారత్ ఒక స్వతంత్ర దేశంగా మాత్రమే యుద్ధాన్ని సమర్ధించగలదని నెహ్రు ప్రకటించారు. ఒక వేళ బ్రిటన్ అధికార బదిలీకి ఒప్పుకొనక పొతే భారతీయులు భారతీయులు యుద్ధంలో పాల్గోనారని, బ్రిటన్‌ చేస్తున్న యుద్ధాన్ని భారత్ వ్యతిరేకించదు అని నెహ్రు చెప్పారు.

నా వీడియోలను వీక్షించండి

క్విట్ ఇండియా ఉద్యమం

యుద్ధం ముగిసేలోపు బ్రిటిష్ వారు భారత్ లో జాతీయ ప్రభుత్వ ఏర్పాటుకు అంగీకరించనందున, కాంగ్రేసు బ్రిటిషు వారికి వ్యతిరేకంగా పోరాటానికి సిద్హ్దమయింది 1940 అక్టోబర్‌లో పరిమిత శాసనోల్లంఘన ప్రచారాన్ని ప్రారంభించాలని గాంధీ ప్రకటించారు. ఇందులో భాగంగా కాంగ్రేసు నాయకులను అంచెలంచలు గా నిరసనలు చేస్తారని చెప్పారు. అయితే బ్రిటిషు వారు నెహ్రూ, గాంధీలను అరెస్టు చేసి నాలుగేళ్ల జైలు శిక్ష విధించారు. కానీ ఒక సంవత్సరం తరువాత వారిని జైలు నుండి విడుదల చేశారు. తరువాత 1942 లో క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభమయింది.

నెహ్రూను గాంధీ భారత ప్రధానిగా చేశాడనే వివాదానికి సంబంధించి న నిజానిజాలను ఒకసారి ప్రస్తావిన్చుకున్దాము.  గాంధీ వాస్తవానికి 15 జనవరి 1941 న దీనికి సంబందించిన వ్యాఖ్యను ఇలా చేశారు,

నా ఈ వ్యాసాలను కూడా చదవండి

“జవహర్‌లాల్ మరియు నేను విడిపోయామని కొందరు అంటున్నారు. మమ్మల్ని వేరు చేయడానికి ఉత్తి అభిప్రాయ భేడాలు సరిపోవు. మేము స్వాతంత్రోద్యమంలో కలిసి పని చెయ్యడం ప్రారంభించినప్పటినుండి మా మధ్య అభిప్రాయ బేధాలు పొరచోపుతూనే ఉండేవి. కానీ మేము కలిసి పనిచెయ్యడం మానలేదు. కాబట్టి ఇప్పుడు నేను నా మనసులోని మాట చెబుతున్నాను. నెహ్రు నా వారసుడు. రాజాజీ కాద.” ఈ సందర్భంలో ఒక ముఖ్యమయిన అంశం గమనించాలి. గాంధీ గారు  రాజాజీ (సి. రాజగోపాలాచారి) నా వారసుడు కాదు నెహ్రూ నే అని చెప్పారు. ఇక్కడ పటేల్ ప్రసక్తి రాలేదు.  

ఇక 1942 లో, గాంధీ బ్రిటిష్ వారిని భారతదేశం విడిచి వెంటనే వెళ్ళిపోవాలని వెళ్ళమని కోరాడు, ప్రజలను బ్రిటిషు వారిని వెళ్ళగొట్టడానికి ఉద్యమించాలని కోరాడు; కానీ నెహ్రూ యుద్ధ సమయంలో బ్రిటిష్ వారిని ఇబ్బంది పెట్టడం మంచిది కాదని అభిప్రాయ పడ్డాడు, ఎందుకంటే బ్రిటిష్ వారు ఫాసిస్ట్ శక్తులకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు, బ్రిటిషు వారు బలహీన పడితే ఫాసిష్టులు విజయం సాధించే అవకాశం ఉంది. అది నెహ్రు కు ఇష్టం లేదు. అయితే నెహ్రూ గాంధీతో కలిసి బ్రిటిష్ వారిపై పోరాటం చెయ్యడానికి వెనుకాడలేదు. గాంధీ ప్రతిపాదించిన “క్విట్ ఇండియా” తీర్మానాన్ని ఆగస్టు 8, 1942 న బొంబాయిలో కాంగ్రెస్ పార్టీ ఆమోదించింది. గాంధీని ఉద్యమాన్ని నడిపించమని కాంగ్రేసు కోరగా గాంధీ క్విట్ ఇండియా నినాదాన్ని ఇచ్చారు. అప్పుడు గాంధీ, నెహ్రూలతో సహా మొత్తం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీని అరెస్టు చేసి జైలులో పెట్టారు. 15 జూన్ 1945 న విడుదలయ్యే వరకు అందరూ జైల్లలోనే కాలం గడిపారు.

కాంగ్రేసు వారు జైలులో ఉండడం తో జిన్నా నేతృత్వంలోని ముస్లిం లీగ్ హిందూ మహాసభ పార్టీ లు చేతులు కలిపి సింధ్, నార్త్ వెస్ట్ ఫ్రంటీర్ ప్రావిన్స్ మరియు బెంగాల్‌ లలో సంకీర్ణ ప్రభుత్వాలను ఏర్పాటు చేసి అధికారంలోకి వచ్చింది.

సావర్కర్ యొక్క హిందూ మహాసభ క్విట్ ఇండియా పోరాటాన్ని వ్యతిరేకించింది. క్విట్ ఇండియా ఉద్యమాన్ని సవార్కర్ ఇలా ఎద్దేవా చేశారు, “బ్రిటిషు వారూ మీరు వెళ్ళిపొండి మీ మిలిటరీ మాకు వదిలేయండి”. ఆర్ఎస్ఎస్ క్విట్ ఇండియా ఉద్యమంలో చేరదని, ఆర్ఎస్ఎస్ ప్రజలు అని గోల్వాల్కర్ ప్రకటించారు. గోల్వాల్కర్ ఆర్ ఎస్ ఎస్ సభ్యులు ఎవరయినా క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొనదలుచు కుంటే వారు వారి వ్యక్తిగత హోదాలో పాల్గొన వచ్కాని ప్రకటించారు. ఈ క్విట్ ఇండియా ఉద్యమంలో వాజ్‌పేయి గారు కొద్ది సమయం పాల్గొన్నాడు, కాని వాజపేయీ అలా చేసినందుకు బ్రిటిష్ వారికి క్షమాపణలు చెప్పుకున్నాడు.

మరియు “క్విట్ ఇండియా” ఉద్యమానికి బ్రిటిషు వారు ఎలా స్పందించాలో ఎలా అణచి వెయ్యాలో చెబుతూ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ బెంగాల్ గవర్నర్‌కు ఒక లేఖ రాశారు. ఈ లేఖలో, 26 జూలై 1942 న ఆయన ఇలా వ్రాశారు:

“కాంగ్రెస్ ప్రారంభించిన విస్తృత క్విట్ ఇండియా ఉద్యమం ఫలితంగా బెంగాల్ ప్రావిన్స లో ఏర్పడబోయే పరిస్థితిని దానిని ఎదుర్కొనే వ్యూహాన్ని నేను సూచిస్తున్నాను.

ఇది యుద్ధ సమయం, కాంగ్రేసు బ్రిటిషు వారిని సంకట పరిస్థితి లోకి నెట్టడానికి విశ్వ ప్రయత్నం చేస్తుంది. ప్రజలను స్వాతంత్ర్య సిద్ధి కొఱకు ఉత్తేజపరుస్తుంది. తద్వారా బెంగాలులో శాంతి భద్రతల కు ఆటంకం కలుగుతుంది.”

“బెంగాల్ లోని ఫజ్లుల్ హక్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం, (హిందూ మహాసభ, ముస్లిం లీగ్ లు కలిసి ఏర్పాటు చేసిన ప్రభుత్వం), క్విట్ ఇండియా ఉద్యమాన్ని అడ్డుకోవటానికి ఆని విధాలా కృషి చెయ్యాల్సి న అవసరం ఉంది”.

“ఎందుచేతనంటే ప్రజలచే ఎన్నుకొనబడిన  ప్రావిన్షియల్  ప్రభుత్వం  బెంగాల్ లో నెలకొని ఉంది. ఇపుడు స్వాతంత్ర్యం కొఱకు ఉద్యమించడం అవివేకం.”

భారతీయులు బ్రిటిష్ వారిపై ఆధారపడాలి, బ్రిటన్ కోసం కాదు, బ్రిటిష్ వారు పొందే ఏ ప్రయోజనం కోసం కాదు, తమను తాము రక్షించుకోవడానికి మరియు స్వాతంత్ర్యం కోసం బెంగాల్ ప్రావిన్స్ కోసం. మీరు బెంగాల్ ప్రావిన్స్ గవర్నర్‌గా, రాజ్యాంగ అధిపతిగా వ్యవహరిస్తారు మరియు మీ మంత్రి మండలి సలహా మేరకు మార్గనిర్దేశం చెయ్యండి.”

అయితే, తరువాత ముఖర్జీ తన అభిప్రాయాన్ని మార్చుకుని క్విట్ ఇండియా పోరాటం సమయంలో బెంగాల్ ప్రజలపై బ్రిటిష్ వారి దమన నీతిని, దురాగతాలను ఖండించారు.

ఒక ప్రక్క కాంగ్రేసు లోని ప్రముఖ నాయకులందరిని జైళ్లలో బంధించారు. అలా కాంగ్రెస్ నాయకత్వం అంతా జైలు పాలైనప్పటికీ క్విట్ ఇండియా ఉద్యమం 1943 సంవత్సరాంతం వరకు కొనసాగింది. జెండా ఉద్యమం తో ప్రారంభమయిన స్వాతంత్ర్య పోరాటం జన జీవన స్రవంతిలో అంతర్భాగామయిపోవడం వలన ఇది సాధ్యమయిందని గమనించాలి. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు, విధ్వంస చర్యలు జరిగాయి. దీనికి ప్రతిగా జరిపిన బ్రిటిషు వారి అణచివేత వలన ఎంతో మంది ప్రాణాలు కోల్పోవడం, జైళ్లకు వెళ్ళడం జరిగింది. 

ఆ సమయంలో మరొక పార్శ్వం ఎమిటంటే, సుమారు 25 లక్షల మంది భారతీయులు బ్రిటిష్ సైన్యంలో చేరి ఐరోపా మరియు ఇతర విదేశీ ప్రదేశాలలో పోరాడారు. వేరే ఫ్రంట్ లో సుభాష్ చంద్రబోస్ యూరప్ లోని ఇటలీ, జర్మనీ, రష్యా దేశాలలో భారత స్వాతంత్ర్య పోరాటానికి వీరి నుండి సహాయ సహకారాలు కోరుతూ చివరకు టోక్యో చేరుకుని జపాన్ నుండి సైనిక సహాయం తీసుకోవడంలో సఫలీకృతుడయ్యాడు. వాస్తవానికి, నేతాజీ ప్రవేశానికి ముందే రాస్ బిహారీ బోస్ ఆద్వర్యంలో ఆజాద్ హింద్ ఫౌజ్ చేత ఏర్పరచబడింది. యుద్ధంలో జపాన్ కు లొంగిపోయిన బ్రిటిషు భారత సైనికులను జపాన్ ఆజాద్ హింద్ ఫౌజ్ లో కలిపివేసింది. నేతాజీని ఈ సైన్యానికి అధిపతిగా చేశారు. బోస్ యొక్క ఆజాద్ హింద్ ఫౌజ్ సైన్యం కొహిమా వరకు చేరుకొని అచట భారతీయ స్వాతంత్ర్య జండాను ఎగురవేసింది.  బోస్ ఆజాద్ హింద్ ఫౌజ్ యొక్క సాయుధ విభాగాలకు నెహ్రూ, గాంధీ మరియు పటేల్ పేర్లను పెట్టారు. దురదృష్టవశాత్తు, జపాన్ ఓడిపోయినప్పుడు, INA కూడా ఓడిపోయింది. సుభాష్ చంద్ర బోస్ విమాన ప్రమాదంలో మరణించారు.

మే 1944 లో గాంధీ వైద్య కారణాల వల్ల జైలు నుంచి విడుదలయ్యారు. విభజన  ప్రతిపాదననుంచి జిన్నాను విరమింప జెయ్యడానికి గాంధీజీ సెప్టెంబరులో బొంబాయిలో జిన్నాను కలిశారు. 1945 లో నెహ్రూ మరియు కాంగ్రెస్ నాయకులందరూ జైళ్ళ నుండి బయటకు వచ్చారు. ఇప్పుడు బ్రిటిష్ వారు భారతదేశం నుండి నిష్క్రమించాలని స్పష్టమయిన నిర్ణయాన్ని ప్రకటించారు.

ఇంతలో, 1946 లో, భారత విభజనకు కాంగ్రెస్ ను బలవంతంగానైనా ఒప్పించాలనే ఉద్దేశ్యంతో జిన్నా ప్రత్యక్ష కార్యాచరణ దినాన్ని (direct action day) ప్రకటించాడు. తరువాత జరిగిన ఘర్షణల్లో సుమారు 7000 మంది మరణించారు. ఈ దుర్ఘటనలు బెంగాలు కుపరిమితమై ఉన్నవి. ఎక్కువగా హిందువులు మరణించారు. 

తరువాత మతం ఆధారంగా భారత దేశ విభజనను అంగీకరించడానికి గాంధీ నిరాకరించినప్పటికీ, చివరికి పాకిస్తాన్ ఏర్పాటును నెహ్రూ అయిష్టంగానే అంగీకరించారు.

పాకిస్తాన్‌ రాజ్యాన్ని బ్రిటిష్ వారు ఆగస్టు 14, 1947 న ఏర్పాటు చేశారు.

మరియు 15, 1947 న, భారతదేశం స్వతంత్ర దేశంగా ఆవిర్భవించింది. నెహ్రూ భారత తాత్కాలిక ప్రధానమంత్రి అయ్యారు. నెహ్రూను గాంధీ నామినేట్ చేయలేదు. కానీ 1946 లో భారత ప్రజలు ఎన్నుకున్న రాజ్యాంగ అసెంబ్లీ చేత ఎన్నుకోబడ్డారు. భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నెహ్రూ ఎన్నికల ప్రచారానికి నాయకత్వం వహించినందున ఇది జరిగింది. అంతకుముందు, పటేల్ పేరును 1946 లో భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికలలో పోటీ చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ కమిటీలు సూచించాయి. కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికలలో పోటీ చేయమని కాంగ్రెస్ కమిటీలు ఇచ్చిన పటేల్ ఆదేశాన్ని గాంధీ తిరస్కరించారు. పటేల్ కు బదులుగా గాంధీ నెహ్రూ పేరును సూచించారు. పటేల్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ చెయ్యలేదు. తరువాత జరిగిన ఎన్నికలలో , 1946 లో, నెహ్రూ భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆ సమయంలో, భారత రాజ్యాంగాన్ని రూపొందించడానికి మరియు తాత్కాలిక ప్రభుత్వంగా పనిచేయడానికి రాజ్యాంగ అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. నెహ్రూ నాయకత్వంలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. వాస్తవానికి ఎంఎన్ రాయ్ 1934 లో రాజ్యాంగ రచన కొఱకు అసెంబ్లీని ఏర్పాటు చెయ్యాలని ప్రతిపాదించారు. 1939 లో సి.రాజగోపాలాచారి కూడా రాజ్యాంగ సభను ఏర్పాటు చెయ్యాలని డిమాండ్ చేశారు. ఆ కల 1946 లో నిజమైంది. ఇప్పుడు నెహ్రూ నేతృత్వంలోని అసెంబ్లీ ముందు అనేక సమస్యలు ఉన్నాయి. నెహ్రూ ప్రజాస్వామ్య మరియు గణతంత్ర రాజ్య వాది. కానీ పటేల్ మరియు మీనన్ అప్పటి రాజులు మరియు నవాబుల పట్ల ఉదారంగా ఉండాలని కోరుకున్నారు. గాంధీ అయితే అసలు దేశము అనే రాజ్య వ్యవస్థకు వ్యతిరేకి.  గాంధీ స్టేట్ కు బదులుగా ట్రస్టీషిప్‌ వ్యవస్థను సూచించారు. బ్రిటిషు వారయితే తాము వెళ్ళిపోయినా తరువాత భారత దేశం వివిధ చిన్న చిన్న రాజ్యాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు యుద్ధాలు చేసుకుంటూ దేశం అల్లకల్లోలంగా మారిపోతుదని విశ్వసించారు.

కానీ అదృష్టవశాత్తూ పండిట్ నెహ్రూ నాయకత్వంలో భారతదేశం ఒక ప్రముఖ స్వతంత్ర ప్రజాస్వామ్య యుత గణతంత్ర రాజ్యంగా ఆవిర్భవించింది. బ్రిటిషు వారి నిష్క్రమణం తరువాత రాము స్వతంత్ర రాజ్యాలు నడుపుకోవచ్చనే  రాజాలు నవాబుల కలలను నెహ్రు ఆదిలోనే త్రుంచివేశారు.  జూలై 1946 లో, స్వతంత్ర భారతదేశ సైన్యానికి వ్యతిరేకంగా ఏ రాజు గాని లేదా నవాబ్ గాని సైనికపరంగా ఎదిరించి నిలిచి గెలవలేరని స్పష్టం  చేశారు. మళ్ళీ జనవరి 1947 లో, త్వరలో ఏర్పడబోయే రిపబ్లిక్ ఆఫ్ ఇండియా రాజుల అధికారాన్ని వారి వారి సంస్తానాలపై అనుమతించదని పేర్కొన్నారు. నెహ్రూ అప్పటికే భారతదేశంలోని రాచరిక వ్యవస్థలు గల ప్రాంతాలలో పర్యటించి  ప్రజలను ప్రజాస్వామ్యం వైపు పురిగొల్పి ఉన్నారు.

ఆల్ ఇండియా స్టేట్స్ పీపుల్స్ కాన్ఫరెన్స్ (AISPC)

పూర్వం 1923 లో, అవినీతిపరులైన మహంతలకు వ్యతిరేకంగా సిక్కులు చేసిన పోరాటానికి మద్దతు ఇవ్వడానికి అక్కడికి వెళ్ళినప్పుడు, నాభ అనే రాచరిక రాజ్యంలో నెహ్రు ఖైదు చేయబడ్డాడు. వివిధ భారత రాష్ట్రాల్లోని ప్రజాస్వామ్య దేశాల కోసం పనిచేయడానికి 1927 లో ఆల్ ఇండియా స్టేట్స్ పీపుల్స్ కాన్ఫరెన్స్ (AISPC) ఏర్పడింది. 1939 లో నెహ్రూను ఆ సంస్థకు అధ్యక్షునిగా చేశారు. భారతదేశాన్ని రాజకీయంగా ఏకీకృతం చేసే సమయంలో అంతకుముందు నెహ్రు నిర్వహించిన పాత్ర ప్రముఖంగా ఉపయోగపడింది. వల్లాభాయ్ పటేల్ మరియు మీనన్ లకు వివిధ రాజ్యాలను ఇండియన్ యూనియన్లో చేర్చే పనిని ఒప్పజేప్పారు. చివరికి 1950 నాటికి సుమారు 562 వివిధ రాజ్యాలు ఇండియన్ యూనియన్‌లో విలీనం అయిపోయాయి. అయితే, కాశ్మీర్‌కు చెందిన మహారాజా హరిసింగ్ పాకిస్థాన్‌తో యధాతథ స్థితి కొనసాగేవిధంగా  ఒప్పందం కుదుర్చుకున్నారు. మరియు భారత్‌తో అలాంటి ఒప్పందం  చేసుకోలేదు. మరియు హైదరాబాద్ నిజాం మాదిరిగా, హరిసింగ్ స్వతంత్ర రాజ్య ఆలోచనను చేశారు. ఎందుకంటే, బ్రిటిష్ వారు వెళిపోతున్న సమయంలో ఈ రాజ్యాలు భారతదేశం లేదా పాకిస్తాన్లో చేరడానికి గాని లేదా స్వాతంత్ర్య రాజ్యాలుగా కొనసాగడానికి గాని వారికి అధికారం ఉంది.  కానీ నెహ్రూ రాజుల దైవిక, వారసత్వ హక్కులను అంగీకరించేదిలేదని చెప్పివేశాడు. తోలి ఒప్పందాలలో 562 మంది రాజులు మరియు నవాబులు రక్షణ, సమాచార మరియు విదేశీ వ్యవహారాలను మాత్రమె  ఇండియన్ యూనియన్‌ కు ఒప్పజేబుతూ సంతకాలు చేశారు (signed the instruments of accession). పైన పేర్కొన్న మూడు సమస్యలు తప్ప, రాజులందరూ తమ సామ్రాజ్యాన్ని పరిపాలించుకోవడానికి స్వేచ్ఛ కలిగి ఉన్నారు. అయితే వారు వారి వారి రాజ్యాలలో ఎన్నికలు జరిపి ప్రజాప్రతినిధుల సభలను ఏర్పాటు చెయ్యాల్సిన అవసరం ఉంది. తదుపరి, ఈ రాజ్యాలలో ఏర్పాటు కాబడిన అసెంబ్లీలు తమ తమ రాజాలు, నవాబులు భారత దేశంలో చేరుతున్నట్లుగా సంతకం చేసిన ఒప్పందాలను ధృవీకరించాలి. వాస్తవానికి రాజాలను , నవాబులను ఈ ఒప్పందాలపై సంతకాలు పెట్టించడానికి ఒప్పించడానికి పటేల్ మీనన్ లు వివిధ మార్గాలను అవలంభించారు. ఒక్కోసారి ప్రజాభిప్రాయాన్ని మన్నిన్చేటట్లు ఒత్తిడి చెయ్యడం, ఒక్కోసారి మిలిటరీ దాడి చేస్తామని భయపెట్టడం కూడా చేశారు. చివరకు వారికి రాజ భరణాలు ప్రలోభం పెట్టి అందరిని ఒప్పించి ఒప్పందాలపై సంతకాలు పెట్టించారు.  

కానీ మైసూర్, సౌరాష్ట్ర మరియు ట్రావెన్కోర్ రాజాలు మరియు భోపాల్ నవాబు తమ స్వంత రాజ్యాంగాలను తయారుచేసుకున్నారు. అయినాగాని 1949 లో సౌరాష్ట్ర రాజ్యం భారత రాజ్యాంగాన్ని అంగీకరించి ఇండియన్ యూనియన్‌లో చేరింది. మైసూర్, ట్రావెన్కోర్ మరియు భోపాల్ రాజ్యాలు 1952 లో (సాధారణ ఎన్నికల తరువాత) భారత గణతంత్ర రాజ్యంలో అంతర్భాగామయిపోయాయి.

హైదరాబాద్ నిజాం

కానీ హైదరాబాద్ రాష్ట్రానికి చెందిన నిజాం స్వతంత్ర రాజుగా కొనసాగాలని ఆకాంక్షించారు. తెలుగు మాట్లాడే ప్రాంతాలలో కమ్యూనిస్టుల ఆద్వర్యంలో తిరుగుబాటు చేసిన హిందూ జనాభాను రజాకార్లు, నిజాం సైనికులు, దొరల సైనికులు కలిసి హింసించారు. చివరికి కమ్యూనిస్టుల సాయుధ పోరాటం విజయం అంచుకు చేరుకుంది. కానీ నిజాం సంస్థానం స్వాతంత్ర్య రాజ్యంగా ఉండడం గానీ లేదా కమ్యూనిస్టులు ప్రభుత్వ పగ్గాలు చేపట్టడం గాని నెహ్రూకు ఆమోదయోగ్యం కాదు. అపుడు నెహ్రూ ఆదేశాల మేరకు సర్దార్ పటేల్ కు  “పోలీసు చర్య” తీసుకోవడానికి సమ్మతినిచ్చారు. పర్యావసానంగా నిజాం 17 సెప్టెంబర్ 1948 న భారతదేశంలోకి ప్రవేశించే ఒప్పందంపై సంతకం చేశారు. ఇక్కడ ఒక విచిత్రమైన అంశం ఒకటుంది. బ్రిటిషు వారి ప్రోద్బలంతో నిజాం ఇండియా తమ దేశం పై దురాక్రమణకు పాల్పడినట్లు భారత్‌పై ఐక్యరాజ్యసమితిలో ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ దరఖాస్తు చివరికి 1978 లో ఉపసంహరించబడింది. భారత రాజ్యాంగం తయారీ సమయంలో, ఆనాటి చాలా మంది కాంగ్రేసు నాయకులు (నెహ్రూ మినహా) ఈ రాజాలు, నవాబులు రక్షణ, సమాచార మరియు విదేశీ వ్యవహారాలు వంటి మూడు అంశాలను ఇండియన్ యూనియన్ కు ఒప్పగించి ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నుకోబడిన అసెంబ్లీ ల సహకారంతో అంతర్గత పరిపాలనలు కొనసాగించుకోవడానికి అనుమతించాలని భావించారు.

కానీ రాజ్యాంగ ముసాయిదా రచన కొనసాగుతున్నప్పుడు మరియు భారతదేశం ఒక గణతంత్ర రాజ్యంగా రూపుదిద్దుకునే అంశాలు రాజ్యాంగంలో చోటుచేసుకుంటున్న కొద్దీ  భారతదేశం ఒక సమైక్య రాజ్యంగా రూపిందితేనే మంచిది అనే భావం బలాన్ని పొందుతూ వచ్చింది. అలా నెహ్రు యొక్క సంకల్పం నిజమై అన్ని రాజ్యాలను భారత్ లో విలీనం చెయ్యడానికి అందరిలోనూ అంగీకారం వచ్చింది. ఇక బ్రిటిష్ వారు సృష్టించిన పాకిస్తాన్ ఏర్పాటు వలన భారతదేశం రెండు ముక్కలుగా చీలిపోయింది.  భారతీయ భూభాగానికి సుమారు 7 లక్షల మంది హిందువులు వలస వచ్చారు. 3 లక్షల మంది ముస్లింలు పాకిస్తాన్‌కు వలస వెళ్ళారు. ప్రపంచ చరిత్రలోనే ఎన్నడూ జరగని మారణహోమం జరిగింది. ఇరు మతాలలోని వారు మరణించారు. మొత్తానికి సుమారు 5 లక్షల మంది మరణించారని ఒక అంచనా.

అప్పటి నుండి పాకిస్తాన్‌ను అమెరికా మరియు బ్రిటన్ లు పాకిస్తాన్ ఉనికిని కాపాడుతూ వస్తున్నాయి. వాస్తవానికి ప్రపంచం లోని వివిధ దేశాల బాల సమీకరణల ను కాపాడడానికి  పాకిస్తానును అమెరికా బ్రిటన్ లు సృష్టించాయి. అప్పటినుండి పాకిస్తాను రష్యా ను హిందూ మహాసముద్రంలోనికి దక్షిణ ఆసియా ద్వారా ప్రవేశించనీయకుండా నిలువరించడానికి ఉపయోగపడుతుంది.  రాజ్యాంగ అసెంబ్లీ డిసెంబర్ 6, 1946 న రాష్ట్రాల శాసనమండలి సభ్యుల మరియు రాష్ట్రాల ప్రతినిధులతో ఎన్నుకోబడింది. 9 డిసెంబర్ 1946 న జె.బి. కృపాలానీ మొదటి సమావేశంలో ప్రసంగించారు మరియు సచిదానంద్ సిన్హాను తాత్కాలిక చైర్మన్‌గా నియమించారు. 11 డిసెంబర్ 1946 న రాజేంద్ర ప్రసాద్‌ను రాజ్యాంగ అసెంబ్లీ అధ్యక్షుడిగా నియమించారు. రాజ్యాంగంలోని అంతర్లీన సూత్రాలను సూచిస్తూ జవహర్‌లాల్ నెహ్రూ 13 డిసెంబర్ 1946 న ‘ఆబ్జెక్టివ్ రిజల్యూషన్’ సమర్పించారు. 22 జనవరి 1947 న భారత రాజ్యాంగానికి ముందుమాటగా (preamble) నెహ్రూ సూచించిన అంశాలను ఏకగ్రీవ తీర్మానం చేసి ఆమోదించబడింది. 22 జూలై 1947 న త్రిరంగ భారత జాతీయ పతాకాన్ని స్వీకరించారు. 1947 ఆగస్టు 15 న భారతదేశాన్ని స్వతంత్ర దేశంగా ప్రకటించారు. ఫలితంగా, బ్రిటిష్ వారు 1950 నాటికి భారతదేశం నుండి శాశ్వతంగా బహిష్కరించబడ్డారు. భారత ప్రభుత్వ మొదటి ప్రధానిగా, నెహ్రూ “భారత దేశాన్ని సంపాదించుకోవాలనే సంకల్పాన్ని సాకారం చెసుకునే దిశగా పయనం” అనే ప్రసిద్ధ ప్రసంగం చేశారు,

బ్రిటిషు వారు తాము ఫలాయణం చిత్తగించేటపుడు వివిధ రాజ్య సంస్థానాలకు భారతదేశం లేదా పాకిస్తాన్లో చేరడానికి స్వేచ్ఛ ఉంది. కానీ ముస్లిం పాలకులు పాకిస్తాన్‌లో చేరాలని గాని, హిందూ రాజులు భారతదేశంలో చేరాలని నియమం ఎక్కడా లేదు. కానీ భారతదేశ విభజన మత ప్రాతిపదికన జరిగిందని బ్రిటిష్ వారి ఆలోచన. ఆశ్చర్య కరమైన విషయం ఏమిటంట నేహృనే కాకుండా జిన్నా కూడా పాకిస్తాను లౌకిక (secular) రాజ్యమేనని ప్రకటించాడు. భారతీయ ప్రజలు ఈ మత సూత్రాన్ని అంగీకరించలేదు. మరియు చాలా మంది ముస్లింలు భారతదేశంలో జీవించడం కొనసాగించారు. ప్రస్తుతం, పాకిస్తాన్ కంటే భారతదేశంలో ఎక్కువ మంది ముస్లింలు ఉన్నారు, భారతదేశంలో ముస్లిముల ఉనికి భారతీయుల ఔన్నత్యానికి గాంధీజీ మరియు నెహ్రూ ఆలోచనలకు వారు ఇచ్చే గురవానికి ప్రతీకలు.

ALSO READ MY ARTICLES ON

“చాలా సంవత్సరాల క్రితం మనము దేశానికి స్వాతంత్ర్యం సంపాదించుకోవాలని ప్రమాణాలు చేసుకున్నాము. ఇప్పుడు మన ప్రమాణాలకు సాకారం ఇపుడు లభించనుంది. ఇపుడు భారతీయుల చేతిలోనికి భారత దేశం వచ్చి చేరింది. ఈ క్లిష్టమైన సమయంలో, భారతీయులు దేశాన్ని పునర్నిమాణం చేసుకోవడానికి మనకు లభించిన హక్కులను చేజారిపోకుండా ఉండేటట్లు నిరంతరం కృషి చెయ్యడానికి ప్రతిజ్ఞ పూనుకోవాల్సిన సమయం ఆసన్నమయింది.”

అలీన దేశాల సమావేశం

విదేశీ వ్యవహారాల విషయాలలో, నెహ్రూ యుఎస్ (అమెరికా) మరియు యుఎస్ఎస్ఆర్ (రష్యన్) వర్గాల నుండి దూరంగా ఉంటూ భారతదేశాన్ని ఆసియాలో ఒక ప్రత్యామ్నాయ శక్తిగా మార్చారు. అతను యుగోస్లేవియాకు చెందిన మార్షల్ టిటో, ఈజిప్టుకు చెందిన నాజర్ మరియు ఇండోనేషియాకు చెందిన సుకర్నోతో చేతులు కలిపాడు. 1959 లో, నెహ్రూ ఆధ్యాత్మిక గురువు మరియు టిబెటన్ రాష్ట్ర అధిపతి దలైలామాకు ఇండియాలో ఆశ్రయం కల్పించారు. 1962 లో చైనా భారతదేశంపై దాడి చేసింది, తరువాత తనకు తానుగా ఉపసంహరించుకుంది, కాశ్మీర్ రాష్ట్రంలోని అక్సాయ్ చిన్ ప్రాంతంలో కొంత భాగాన్ని ఆక్రమించుకుంది. అయినప్పటికీ, నెహ్రూ చీనా బెదిరింపులకు లొంగ లేదు. దలైలామాను చైనాకు అప్పగించలేదు. 1961 లో పోర్చుగీస్ నియంత్రణలో ఉన్న గోవాపై దాడి చేయడానికి నెహ్రూ భారత సైన్యానికి అధికారం ఇచ్చాడు మరియు దానిని ఇండియన్ యూనియన్‌లో విలీనం చేశాడు.

నా ఈ పేజీలు  కూడా చదవండి

జవహర్‌లాల్ నెహ్రూ ఆధ్వర్యంలో, కొరియా సంక్షోభం మరియు సూయజ్ కాలువ సంక్షోభాన్ని పరిష్కరించడానికి భారత్ కృషి చేసింది. ఇండోనేషియా ప్రధాన మంత్రి సుకర్నో నెహ్రూను “లైట్ ఆఫ్ ఆసియా” అని ప్రశంసించారు, వాస్తవానికి ఈ పదం బుద్ధ దేవుడిని సంబోదించడానికి వాడతారు. భారత ప్రజలు నెహ్రూను ఆధునిక భారతదేశ వ్యవస్థాపకుడిగా భావిస్తారు.

కొంతమంది వ్యక్తులు మరియు కొన్ని సంస్థలు నెహ్రూ గురించి అసభ్యకరంగా మాట్లాడతాయి. మరియు నెహ్రూను ఒక అసమర్దుడుగాను, పరాజయుడుగాను చిత్రీకరించడానికి ప్రయత్నిస్తాయి. భారతదేశానికి ప్రజాస్వామ్య రాజకీయాలను తీసుకురావడంలో నెహ్రూ ఎలా విజయం సాధించాడో, భారతదేశాన్ని అభివృద్ధి చేయడానికి అతను ఎంత ప్రయత్నించాడో, నెహ్రూ భారతదేశాన్ని ప్రపంచంలోనే ప్రధాన దేశంగా ఎలా మార్చాడో మనం పైన ఇప్పటి వరకు జరిపిన చర్చలో చూశాము.

కాశ్మీర్ సమస్య

కాశ్మీర్ సమస్యకు నెహ్రూనే కారణమని కొందరు నిదిస్తుంటారు. మహారాజా హరిసింగ్ సామ్రాజ్యంలో కాశ్మీర్ లోయ, జమ్మూ, ఆక సాయిచిన్ ప్రాంతం, లడఖ్, గిల్గిట్ మరియు బాల్టిస్తాన్ లు ఉండేవి. గిల్గిట్ మరియు బాల్టిస్తాన్ ప్రాంతాన్ని బ్రిటిష్ వారి లీజులో ఉండేది. మహారాజు భారతదేశానికి ప్రవేశించే ముందు ఆ లీజును రద్దు చేశాడు. బ్రిటిష్ వారు చట్ట విరుద్ధంగా గిల్గిట్ బాల్టిస్తాన్ ప్రాంతాన్ని పాకిస్తాన్‌కు అప్పగించారు. మరియు చైనా 1952 లో ఆక సాయిచిన్ ప్రాంతాన్ని ఆక్రమించింది. ఇప్పుడు ఆజాద్ కాశ్మీర్ అని పిలువబడే కొన్ని ప్రాంతాలను పాకిస్తాన్ గిరిజన దాడుల వంకతో ఆక్రమించింది. ఇప్పుడు కాశ్మీరీ సామ్రాజ్యం యొక్క భూభాగంలో 60% ఇప్పుడు భారతదేశంలో కాశ్మీరు రాష్ట్రం గా విలసిల్లుతుంది. గిల్గిత్ బాల్టిస్తాన్ పూర్వపు కాశ్మీర్ సామ్రాజ్యం యొక్క 25% భూభాగాన్ని కలిగి ఉంది. ఆజాద కాశ్మీర్ అని పిలవబడే ప్రాంతం పూర్వపు కాశ్మీర్ రాష్ట్రంలో 15% భూభాగాన్ని కలిగి ఉంటుంది. పాకిస్తాన్ గిల్గిత్ బాల్టిస్తాన్ మరియు ఆజాద్ కాశ్మీర్లకు పాకిస్తాన్ రాజ్యంగములో ప్రాతినిధ్యం ఉండదు. అది ప్రత్యెక మిలిటరి పరిపాలనలో ఉంటుంది. తన స్వాధీనంలో ఉన్న కాశ్మీరు ప్రాంతాన్ని ఆజాద్ కాశ్మీరు అంటుంది. ఎందుకంటే పాకిస్తాన్ ఈ ప్రాంతాలను పాకిస్తాన్‌లో కలపడం చట్టవిరుద్ధం గనుక. కాశ్మీర్ మహారాజా ఈ ప్రాంతాలను పాకిస్తాన్‌లో కలుపుతూ ఏవిధమయిన ఒడంబడికలు చేసుకోలేదు. చట్టరీత్యా ఈ ప్రాంతాలన్నీ భారత భూభాగములు. ప్రస్తుతం కాశ్మీర్ లోయలో 90 శాతం మంది ముస్లిం వర్గాలకు చెందినవారు. మరియు జమ్మూ జనాభాలో 30% ముస్లింలు. లడఖ్ జనాభాలో 46% ముస్లింలు వీరందరూ షియా వర్గానికి చెందినవారు. మరియు 50% లడఖ్ ప్రజలు బౌద్ధమతాన్ని అనుసరిస్తున్నారు. మొత్తంగా, కాశ్మీరు జనాభాలో 70% ఇప్పుడు కాశ్మీర్, జమ్మూ మరియు లేహ్ భారతదేశంలో నివసిస్తున్నారు.

ఇప్పుడు, మహారాజా భారతదేశంలోకి ప్రవేశించినప్పుడు కాశ్మీర్లో పరిస్తితుతులను సమీక్షిద్దాం.

వాస్తవానికి మహారాజా హరి సింగ్ స్వతంత్రంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు, ఎందుకంటే అతను కాష్మీరును భారతదేశం లో కలిపితే ముస్లింలు అసంతృప్తి చెందుతారని మరియు హిందువులు, సిక్కులు, బౌద్ధులు పాకిస్తాన్లో చేరితే అసురక్షితమవుతారని భావించారు. అందువల్ల అతను కాశ్మీర్ ను స్వాతంత్ర్య రాజ్యంగా కొనసాగించాలని కోరుకున్నాడు.  

మహారాజా కాష్మీరును పాకిస్తానులో కలపడాన్ని అనివార్యంగా భావించేటట్లు చెయ్యడానికి పాకిస్తాన్ ముస్లిం లీగ్ యొక్క ఏజెంట్ల ద్వారా కాశ్మీరు లో అంతర్గత అశాంతిని ప్రేరేపించి, పూంచ్‌లోని స్థానిక ముస్లింలను సాయుధ తిరుగుబాటు చేయమని ప్రోత్సహించడానికి తీవ్రంగా కృషి చేసింది. మరియు పాకిస్తాన్ పంజాబ్‌ ద్వారా కాశ్మీరుకు సాధారణంగా జరుగుతుందే వస్తు రవాణా ప్రక్రియకు ఆటంకాలు కల్పించడం ప్రారంభించింది.   

మరొక విధంగా విభజన గందరగోళంలో రాష్ట్రంలోని జమ్మూ విభాగంలో మతతత్వ అల్లర్లు చెలరేగాయి, రావల్పిండి మరియు సియాల్‌కోట్ ప్రాంతాల నుండి వలస వచ్చినవారు జమ్మూకు చేరుకున్నారు మరియు హిందువులపై జరిగిన దారుణాలను జమ్మూ లో వివిరించడంతో జమ్మూ హిందువులు ముస్లింలపై అల్లర్లు చేశారు. ఈ ప్రాంతంలో ఆర్‌ఎస్‌ఎస్ చురుకుగా పని చేసింది. అప్పుడు పశ్చిమ కాశ్మీర్ ముస్లింలు ఇబ్రహీం ఆధ్వర్యంలో తిరుగుబాటు దళాన్ని ఏర్పాటు చేసి 1946 అక్టోబర్‌లో ఆజాద్ కాశ్మీర్‌ను ప్రకటించారు. 1946 లో, నేషనల్ కాన్ఫరెన్స్ (National Conference ) ‘క్విట్ కాశ్మీర్’ ఉద్యమాన్ని ప్రారంభించింది, మహారాజు కాశ్మీర్ ప్రజలకు అధికార పగ్గాలు అప్పగించాలని కోరాడు. ముస్లిం సమావేశం (Muslim Conference)  జాతీయ సమావేశాన్ని(National conference) ను వ్యతిరేకించింది. 22 జూలై 1947 నాటికి, ముస్లిం కాన్ఫరెన్స్ కాశ్మీర్  పాకిస్తాన్‌లోకి ప్రవేశించాలని డిమాండ్ చేసింది. అబ్దుల్లాను  మరియు అబ్బాస్ ను ఇద్దరిని మహారాజు జైలులో పెట్టేశారు.

జమ్మూలో కూడా అల్లర్లు మొదలయ్యాయి. ప్రేమ్ నాథ్ డోగ్రా జమ్మూలోని రాష్ట్ర స్వయంసేవక్ సంఘం అధ్యక్షుడు (డైరెక్టర్). 1942 లో బలరాజ్ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) ప్రచారక్‌ గా మాధోక్ రాష్ట్రానికి వచ్చారు. అతను జమ్మూలో మరియు తరువాత కాశ్మీర్ లోయలో ఆర్ఎస్ఎస్ శాఖలను స్థాపించాడు. మే 1947 లో, దేశ విభజన తరువాత, హిందూ సభ మహారాజుకు స్వతంత్రంగా ఉండటానికి మద్దతు ఇచ్చింది. నవంబర్ 1947 లో, భారతదేశంలోకి రాష్ట్రం ప్రవేశించిన వెంటనే, హిందూ నాయకులు జమ్మూ కాశ్మీర్‌ను భారత్‌తో “పూర్తి సమైక్యత” సాధించాలనే లక్ష్యంతో జమ్మూ ప్రజా పరిషత్‌ను ప్రారంభించారు, షేక్ అబ్దుల్లా ప్రభుత్వాన్ని కమ్యూనిస్టుగా పిలిచారు.

రవాణా మార్గాలను పాకిస్తాన్ అడ్డుకోవడంతో కాశ్మీర్‌కు అవసరమైన సామాగ్రిని కోరుతూ మహారాజా సెప్టెంబర్ 19 న నెహ్రూ, పటేల్‌కు సహాయం కొఱకు సందేశం పంపారు. అయితే నెహ్రు భారత్ సహకారం చెయ్యాలంటే షేక్ అబ్దుల్లాను జైలు నుంచి విడుదల చేయాలని, కాశ్మీర్ లో  ప్రజాస్వామ్య వ్యవస్థలు పనిచేయడం ప్రారంభించాలని నెహ్రూ డిమాండ్ చేశారు. దీని ప్రకారం, మహారాజా షేక్ అబ్దుల్లాను సెప్టెంబర్ 29 న జైలు నుండి విడుదల చేశారు. ఇంతలో, పాకిస్తాన్ తన దళాలను గిరిజన దాడుల ముసుగులో శ్రీనగర్ వైపు దాడికి పంపించింది. అప్పుడు కాశ్మీర్ మహారాజా భారతదేశానికి సైనిక సహాయం కోసం ఒక అభ్యర్ధనను (SOS ను) పంపారు.

కానీ పాకిస్తాన్, ఇండియా మరియు కాశ్మీర్ లు ఆ సమయంలో మూడు సార్వభౌమ దేశాలు. చట్టబద్ధంగా భారతదేశం లేదా పాకిస్తాన్ కాశ్మీర్‌కు దళాలను పంపలేవు. ఈ కారణంగానే పాకిస్తాన్ తన దళాల ప్రవేశాన్ని గిరిజన దాడిగా పేర్కొంది. అంతేకాకుండా, పాకిస్తాన్ నుండి సైనిక దాడి  ని నివారించడానికి మహారాజా పాకిస్తాన్తో యధాస్థితి ఒప్పందం కుదుర్చుకున్నారు. అందువల్ల, మహారాజా భారతదేశంలోకి చేరితే తప్ప భారత సైనికులను పంపడానికి వీలు లేదని నెహ్రు చెప్పారు.

అపుడు 1947 అక్టోబర్ 26 న మహారాజు భారతదేశంలోకి ప్రవేశించే ఒప్పందంపై సంతకం చేశారు. అలా కాశ్మీర్ భారతదేశంలో అంతర్ భాగమైంది.  

డోగ్రాల ఆధ్వర్యంలో స్వతంత్ర కాశ్మీర్ వాదం తరఫున ఆర్‌ఎస్‌ఎస్ తొలుత బ్యాటింగ్ చేసింది. కానీ అది మహారాజా ఆధీనంలో మాత్రమె. తరువాత అబ్దుల్లా హయాంలో జమిన్దారి వ్యవస్థ రద్దు కావడంతో వీరి బాణీ మారింది. ఎందుచేతనంటే భారత్ లోని వివిధ ప్రావిన్స్ లలో జమిందారి వ్యవస్థల రద్దు లను కోర్టులు చెల్లవని తీర్పులు చెప్పాయి. కాశ్మీరు భారత్ లో కలిసిపోతే కాశ్మీరులో కూడా జమిన్దారీల రద్దు చెల్లకుండా పోతుందని కాశ్మీర్‌ను భారత్‌తో పూర్తిగా అనుసంధానించాలని పిలుపునిచ్చింది.

మరో ప్రక్క షేక్ అబ్దుల్లా కాశ్మీర్ స్వతంత్రంగా ఉండాలని కోరాడు గాని మహారాజా లేకుండా.  పాకిస్తాను నుండి కాష్మీరును స్వతంత్ర్యంగా ఉంచాలంటే భారత్ నుండి రక్షణ తీసుకోవడం తప్ప మరో గత్యంతరం లేదని గ్రహించిన అబ్దుల్లా  కాశ్మీరు భారతదేశంలోకి ప్రవేశించడానికి అంగీకరించాడు.   చివరగా 1956 లో, కాశ్మీరీ రాజ్యాంగ సభ మహారాజు హరిసింగ్ భారత దేశంలో కాష్మీరును విలీనం చేస్తూ ఒప్పందం పై  చేసిన  సంతకాన్ని ఆమోదించి విలీనాన్ని ధృవీకరించింది. కాశ్మీర్ (జమ్మూ కాశ్మీర్) భారతదేశంలో విడదీయరాని భాగం అని, భారతదేశంలోకి ప్రవేశించడం అంతిమమని కాశ్మీర్ రాజ్యాంగం పేర్కొంది. కానీ షేక్ అబ్దుల్లా ఈ తీర్మానానికి పార్టీ కాదు. ఆ సమయంలో జైలుకు వెళ్లాడు.

షేక్ అబ్దుల్లా 17 మార్చి 1948 న రాష్ట్ర ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. మహారాజా హరి సింగ్ కుమారుడు కరణ్ సింగ్‌ను సదర్-ఎ-రియాసత్ (రాజ్యాంగ దేశాధినేత) మరియు రాష్ట్ర గవర్నర్‌గా నియమించారు. అక్టోబర్ 1951 లో, జమ్మూ కాశ్మీర్ జాతీయ సదస్సు రాష్ట్ర రాజ్యాంగాన్ని రూపొందించడానికి జమ్మూ కాశ్మీర్ రాజ్యాంగ సభను ఏర్పాటు చేసింది.

అంతకుముందు 1949 లో షేక్ అబ్దుల్లా ప్రభుత్వం ‘రియల్ ఎస్టేట్ నిర్మూలన చట్టం’ ను ఆమోదించింది. ఇది పరిహారం లేకుండా భూస్వాముల నుండి భూమిని తీసుకోవడానికి ప్రభుత్వానికి వీలు కల్పిస్తుంది. వాస్తవానికి ఆ సమయంలో భారత ప్రావిన్సులలోని అన్ని ప్రభుత్వాలు కూడా అదేరకమయిన చత్తాలు చేశాయి. కాని ఇండియాలో ఈ చట్టాలను కోర్టులు నిలిపివేశాయి. జమ్మూ ప్రజా పరిషత్ షేక్ యొక్క భూ సంస్కరణలకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగింది, ఈ చట్టం భారత రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కులకు, ముఖ్యంగా ఆస్తి హక్కుకు వ్యతిరేకంగా ఉందని వాదించింది. (1977-80 మధ్య భారతదేశాన్ని పాలించిన భారతీయ జనసంఘం, భారత రాజ్యాంగం నుండి కమ్యూనిస్టులతో చేతులు కలపడం ద్వారా భారతీయులకు ఆస్తిపై గల ప్రాథమిక హక్కును తొలగించింది.)

(కానీ భారతదేశంలో, నెహ్రూ 1952 లో ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయడం ద్వారా జమీందారీలను రద్దు చేశారు. కాంగ్రేసు లోని ప్రముఖులు నెహ్రు తీసుకున్న ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. తరువాత 1957 లో వీరు స్వతంత్ర పార్టీ పెట్టి కాంగ్రెసుపై పోటీకి దిగారు. 1977 నాటికి జన సంఘ తో స్వతంత్ర పార్టీ కలగలసి భారతీయ జనతా పార్టీ గా ఆవిర్భవించింది. )

మరియు జనవరి 15, 1952 న, విద్యార్థులు జమ్మూలో యూనియన్ ఆఫ్ ఇండియా జెండాతో కలిపి రాష్ట్ర జెండాను ఎగురవేయడానికి వ్యతిరేకంగా ప్రదర్శనను నిర్వహించారు. రాజ్యాంగ ప్రతిష్టంభనను తొలగించడానికి నెహ్రూ ఒక ప్రతినిధి బృందాన్ని పంపమని జాతీయ సమావేశాన్ని (National conference) ను ఆహ్వానించారు. భారత రాజ్యాంగం ను జమ్మూ కాశ్మీర్‌కు వర్తింప చేయడానికి, రాష్ట్రానికి మరియు కేంద్రానికి మధ్య సంబంధాలను సరిచేసుకోవడానికి  1952 Delhi దిల్లీ ఒప్పందం రూపొందించబడింది. ఇది 24 జూలై 1952 న నెహ్రూ మరియు అబ్దుల్లా మధ్య జరిగింది. తదనంతరం, రాజ్యాంగ అసెంబ్లీ కాశ్మీర్‌లో రాచరికంను రద్దు చేసి, ఎన్నికైన దేశాధినేత (సదర్-ఇ రియాసత్) ను స్వీకరించింది. ఈ మధ్యలో అబ్దుల్లా పాకిస్తాను పర్యటన నిర్వహించాడు. ఆ తరువాత ఆటను తన బాణీ ని మార్చాడు. దిల్లీ ఒప్పందంలో అంగీకరించిన మిగిలిన సమస్యలపై అబ్దుల్లా నేతృత్వంలోని అసెంబ్లీ వ్యతిరేకించడం ప్రారంభించింది. కాశ్మీరీలకు  స్వీయ-నిర్ణయం కోసం పట్టు పట్టడం ప్రారంభించాడు. అప్పుడు నెహ్రూ షేక్‌ను అరెస్టు చేసి బక్షి మొహమ్మద్‌ను కాశ్మీరు ప్రధాన మంత్రిగా నియమించాడు.  

ఈ మధ్యలో హిందూ జమ్మూ ప్రజా పరిషత్ నవంబర్ 1952 లో మూడవసారి అవిధేయత ప్రచారాన్ని ప్రారంభించింది. అబ్దుల్లా ప్రభుత్వం అణచివేత చర్యలను తీసుకుంది.

మే 1953 లో, గోల్వాకర్ సలహా మేరకు, భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకుడు శ్యామా ప్రసాద్ ముఖర్జీ, కాశ్మీర్ ప్రభుత్వం నుండి అనుమతి తీసుకోకుండా జమ్మూ కాశ్మీర్‌లోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు. భారతీయ పౌరుడిగా దేశంలోని ఏ ప్రాంతానికైనా వెళ్ళే హక్కు తనకు ఉందని ఆయన వాదించారు. అబ్దుల్లా అతని ప్రవేశాన్ని అడ్డుకుని అరెస్టు చేశాడు. దురదృష్టవశాత్తు, ముఖర్జీ అనారోగ్యం కారణంగా 23 జూన్ 1953 న మరణించారు. అతను 1945 కి ముందు ఊపిరి తిత్తుల వ్యాధితో బాధపడుతున్దేవాడని సమాచారం. కాశ్మీర్ యొక్క శీతల వాతావరణంలో ఈ వ్యాధి తిరగ బెట్టిందని చెబుతారు. గుండెపోటు రావడంతో అతన్ని శ్రీనగర్ ఆసుపత్రికి తరలించారు. అతను ఒక రోజు తరువాత అక్కడ మరణించాడు.  

కాశ్మీర్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన బక్షి మొహమ్మద్ ‘1952 Delhi దిల్లీ ఒప్పందం’ లోని  అన్ని అంశాలను అమలు చేశాడు. మే 1954 లో, రాజ్యాంగం (జమ్మూ కాశ్మీర్) ఆర్డర్, 1954, భారత రాష్ట్రపతి ఆర్టికల్ 370 ప్రకారం జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వ సమ్మతితో జారీ చేశారు.

ఆ క్రమంలో, రాష్ట్రంలోని “శాశ్వత నివాసితులను” నిర్వచించడానికి మరియు ఆ శాశ్వత నివాసితులకు ప్రత్యేక హక్కులను అందించడానికి జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర శాసనసభకు అధికారం ఇవ్వడానికి ఆర్టికల్ 35 ఎ భారత రాజ్యాంగంలో చేర్చబడింది. (ఇలాంటి రాజ్యాంగ అధికరణాలు – 371, A,B,C,D,E – లు అనేక రాష్ట్రాల్లో అమలులో ఉన్నాయి.  గుజరాత్‌లోని కొన్ని ప్రాంతాలు కూడా ఈ విభాగాల నిబంధనల ప్రకారం పాలించబడుతున్నాయి. 1920 నుండే కాశ్మీర్, హైదరాబాద్ సహా పలు రాష్ట్రాల్లో స్థానిక ప్రజల హక్కులకు సంబంధించిన ముల్కీ లాంటి చట్టాలు అమల్లో  ఉన్నాయని గమనించాలి.)

ఫిబ్రవరి 15, 1954 న, జమ్మూ కాశ్మీర్ రాజ్యాంగ అసెంబ్లీ సభ కాశ్మీరు భారతదేశం లోని అంతర్భాగమని ప్రకటించింది.  కాశ్మీరు భారతదేశంలో ప్రవేశించడం నిష్చితమని మరియు కాశ్మీర్ భారతదేశంలో విడదీయరాని భాగం అని ప్రకటించింది. నవంబర్ 17, 1956 న, జమ్మూ కాశ్మీర్ రాజ్యాంగాన్ని శాసనసభ ఆమోదించింది మరియు 26 జనవరి 1957 నుండి పూర్తిలోకి వచ్చింది.

షేక్ అబ్దుల్లా జైలు లో ఉన్నప్పుడు, అతని ఆయాయుడు మీర్జా అఫ్జల్ బేగ్ 1955 ఆగస్టు 9 న కాశ్మీరు రాజ్య స్వాతంత్ర్యాన్ని నిర్ణయించడానికి  ప్రజాభిప్రాయ సేకరణ చెయ్యాలని మరియు షేక్ అబ్దుల్లాను బేషరతుగా విడుదల చేయాలని కోరుతూ పోరాడటానికి ప్లెబ్సైట్ ఫ్రంట్‌ను ఏర్పాటు చేశారు. ప్లెబ్సైట్ ఫ్రంట్ యొక్క కార్యకలాపాలు చివరికి 1958 లో కాశ్మీర్ కుట్ర కేసు మరియు మరో రెండు కేసులకు దారితీశాయి. ఈ విషయాలపై ఆరోపణలపై 1958 ఆగస్టు 8 న అబ్దుల్లాను మళ్లీ అరెస్టు చేశారు.

27 డిసెంబర్ 1963 న హజ్రత్‌బాల్ మందిరం నుండి పవిత్ర అవశేషాలు అదృశ్యమైన కారణంగా భారీ అశాంతి తరువాత, రాష్ట్ర ప్రభుత్వం 1964 ఏప్రిల్ 8 న కాశ్మీర్ కుట్ర కేసులో అన్ని ఆరోపణలను దౌత్యపరమైన నిర్ణయంగా తలంచి తొలగించింది. షేక్ అబ్దుల్లాను విడుదల చేసి శ్రీనగర్కు తిరిగి పంపింది. 21 నవంబర్ 1964 న, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 356 మరియు 357 లను కాశ్మీర్ రాష్ట్రానికి విస్తరించారు, దీని ఆధారంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర పాలనను చేపట్టి దాని శాసన అధికారాలను ఉపయోగించుకోవచ్చు. 24 నవంబర్ 1964 న, జమ్మూ కాశ్మీర్ శాసనసభ సదర్-ఎ-రియాసత్ ఎన్నికైన పదవిని “గవర్నర్” నామినేటెడ్ పదవిగా మార్చడానికి రాజ్యాంగ సవరణను ఆమోదించింది. మరియు అపుడే “ప్రధానమంత్రి” పేరును “ముఖ్యమంత్రి” గా మార్చారు.  3 జనవరి 1965 న, 1967 అసెంబ్లీ ఎన్నికలకు ముందు, జమ్మూ కాశ్మీర్ జాతీయ సదస్సు భారత జాతీయ కాంగ్రెస్‌లో విలీనం అయ్యింది.

అంతకుముందు జనవరి 1951 లో, కాశ్మీర్‌లో కామన్వెల్త్ దళాన్ని మోహరించాలని ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి రాబర్ట్ మెన్జీస్ సూచించారు. (పాకిస్తాన్ మరియు భారతదేశం) రెండూ ఒక ఒప్పందం కుదుర్చుకోకపోతే మధ్యవర్తిత్వం పరిగణించబడుతుందని అమెరికా మరియు బ్రిటన్ ప్రతిపాదించాయి. పాకిస్తాన్ అంగీకరించింది కాని కాశ్మీర్లో నాలుగు మిలియన్ల ప్రజల విధిని నిర్ణయించడానికి మూడవ వ్యక్తిని భారత దేశం అనుమతించదని నెహ్రూ చెప్పారు. ఐక్యరాజ్యసమితి నియమించిన ప్రజాభిప్రాయ నిర్వాహకుడైన నిమిట్జ్‌ను భారత్ తిరస్కరించింది, ఎందుకంటే అమెరికా పాకిస్తాన్‌కు మద్దతు ఇస్తుందని భారత్ ఆరోపించింది.

ఫిబ్రవరి 1954 లో, పాకిస్తాన్కు సైనిక సహాయం అందించబోతున్నామని అమెరికా ప్రకటించింది. మే నెలలో పాకిస్తాన్‌తో అమెరికా సైనిక ఒప్పందం కుదుర్చుకుంది, దీని ద్వారా పాకిస్థాన్‌కు సైనిక పరికరాలు, శిక్షణ లభిస్తుంది. (ప్రస్తుతం అమెరికా పాకిస్తాన్లో తన సైనిక స్థావరాలను నిర్వహిస్తోంది.) అమెరికా అధ్యక్షుడు భారత్‌కు ఇలాంటి ఆయుధాలను ఇవ్వడం ద్వారా భారతదేశ ఆందోళనలను తీర్చడానికి ప్రయత్నించారు. కానీ భారత్ ఈ ప్రతిపాదనను తిరస్కరించింది.

 కాశ్మీర్‌లో ప్రజాస్వామ్యం ప్రబలంగా ఉండేలా నెహ్రు తన వంతు కృషి తానూ చేశారు. ముఖ్యంగా మహారాజా స్థానంలో మరొక రాజుగా షేక్ అబ్దుల్లా ను నెహ్రు అనుమతించలేదు.  జమ్మూ కాశ్మీర్‌లో ఆర్‌ఎస్‌ఎస్, హిందూ మహాసభ రాజకీయ ఎత్తుగడలను నెహ్రూ తిప్పికొట్టారు.

ఆర్టికల్ 370 కు సంబంధించి, ఈ ఆర్టికల్ ను సర్దార్ వల్లభాయ్ పటేల్ మరియు కృష్ణ స్వామి అయ్యంగార్ లు కలిసి తయారు చేశారని మరియు భారత రాజ్యాంగంలో ఈ ఆర్టికిల్ ను చేర్చే ముందు వారు నెహ్రూ ఆమోదం పొందారని ఇప్పుడు దొరుకుతున్న పత్రాలద్వారా మనకు తెలుస్తుంది. కమిటీ లోని ఇతర సభ్యులందరినీ ఒప్పించడంలో తాను విజయం సాధించానని, నెహ్రూ ఆమోదం కోసం ఎదురు చూస్తున్నానని పటేల్ స్వయంగా నెహ్రూకు వ్రాసిన ఉత్తరం ఇపుడు మనకు లభిస్తుంది.

ఆర్టికల్ 370 ను పటేల్ నెహ్రు బలవంతంపై తయారుచేసి ఉంటాడని కొంతమంది అనవచ్చు.  అదే జరిగితే, పటేల్ వివిధ సంస్థానాలను నెహ్రు మాటపైనే విజయవంతంగా విలీనం చేయ్యగాలిగాడని ఈ విమర్శకులు ఒప్పుకోవాల్సి వస్తుంది.   

Facebook20
X (Twitter)20
LinkedIn20
Share
WhatsApp20